లవర్ టార్గెట్ రీజనబులే – ప్రీ రిలీజ్ బిజినెస్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ ఎల్లుండి థియేటర్లలో అడుగు పెట్టనుంది. డియర్ కామ్రేడ్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణ ప్రేక్షకుల్లో ఓవర్ హైప్ రాకుండా జాగ్రత్త పడిన టీమ్ కంటెంట్ తోనే మాట్లాడతామని ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పడం చూస్తే ఏదో విషయం ఉన్నట్టే ఉంది. ఆడియో మరీ అద్భుతాలు చేయలేదు కానీ ట్రైలర్ మాత్రం ఆసక్తిని రేపింది.

నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడే గౌతమ్ గా విజయ్ దేవరకొండ చాలా కొత్తగా డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అసలు అంతమందిని ఎందుకు లవ్ చేశాడు వాళ్లలో నిజంగా అతనికి చివరిదాకా తోడుండేది ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. ఇక దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ కూడా ఆసక్తి రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫేమస్ లవర్ థియేట్రికల్ రైట్స్ ని సుమారు 29 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.

బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఈ మొత్తాన్ని ఈజీగా రాబట్టుకుంటాడు. గతంలో గీత గోవిందం 60 కోట్లు అర్జున్ రెడ్డి 40 కోట్ల దాకా షేర్లు రాబట్టి విజయ్ దేవరకొండ స్టామినా చాటాయి. సో వరల్డ్ ఫేమస్ లవర్ కు పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థ్రెసా, ఇసాబెల్లె హీరోయిన్లు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ కు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు గారి అబ్బాయి వల్లభ నిర్మాతగా వ్యవహరించారు. ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ ఫిగర్లు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

ఏరియా  బిజినెస్ 
నైజాం  8.00cr
సీడెడ్   4.00cr
ఆంధ్ర 10.00cr
ఆంధ్ర + తెలంగాణా  22.00cr
కర్ణాటక  + రెస్ట్ అఫ్ ఇండియా 3.50cr
ఓవర్సీస్   3.50cr
ప్రపంచవ్యాప్తంగా   29cr

Show comments