iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరంటే?

  • Published Aug 31, 2024 | 12:25 PM Updated Updated Aug 31, 2024 | 12:25 PM

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్.. ద విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రౌడీ బాయ్ ఇమేజ్ ను దాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విషయం పక్కన పెడితే.. ఇక్కడ విజయ్ తో లవ్ ప్రపోజ్ చేయించుకుంటున్న ఆమె ఎవరో తెలుసా...?

Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్.. ద విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రౌడీ బాయ్ ఇమేజ్ ను దాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విషయం పక్కన పెడితే.. ఇక్కడ విజయ్ తో లవ్ ప్రపోజ్ చేయించుకుంటున్న ఆమె ఎవరో తెలుసా...?

  • Published Aug 31, 2024 | 12:25 PMUpdated Aug 31, 2024 | 12:25 PM
విజయ్ దేవరకొండ ప్రపోజ్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరంటే?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. డీసెంట్ లుక్స్‌తో అమ్మాయిల్ని ఫ్లాట్ చేసిన రాకుమారుడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఒక్కో మెట్టు పేర్చుకుంటూ తక్కువ కాలంలోనే స్టార్ డమ్ సంపాదించాడు. టాలీవుడ్డే కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం పడి చచ్చిపోతుంటారు. ఆంజనేయులు, నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలతో మెరిసిన విజయ్ కెరీర్‌ను మార్చిన చిత్రం ఎవడే సుబ్రమణ్యం. ఇక పెళ్లి చూపులుతో బాయ్ నెక్ట్స్ డోర్ గాయ్‌గా కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్ అన్న ట్యాగ్ వచ్చి చేరింది. ఇక అక్కడ నుండి స్టార్ హీరోగా మారిన సంగతి విదితమే. ఇటు నిర్మాతగానూ మారి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అమ్మాయిలే పడి చచ్చిపోయే విజయ్ దేవరకొండ.. ఓ యువతికి ప్రపోజ్ చేస్తున్నాడు చూశారా..? ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

విజయ్ నటుడు, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని తెలుసు. కానీ కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించిన విషయం తెలుసా..? చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఫోటో ఆ మ్యూజిక్ వీడియోలోనిదే. ‘నీ వెనకాలే నడిచి, నీ వెలుగుల్లో మై మరిచి, నీ జతక బతకాలి ఎలాగైనా’ అంటూ సాగిపోయే ఈ సాంగ్‌లో క్లీన్ అండ్ నీట్ విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఈ ఫ్యామిలీ హీరో ప్రపోజ్ చేస్తున్న ఈ భామ మాలోబికా బెనర్జీ. ఈ బెంగాలీ రసగుల్లా.. ఈ రౌడీ బాయ్‌తో కలిసి ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో కనిపించింది. కోల్ కతాలో పుట్టిన ఈ అమ్మాయి అనేక మ్యూజిక్ ఆల్బమ్స్‌లో యాక్ట్ చేసింది. ఒరియా, బెంగాలీ భాషల్లో చిత్రాలను చేసింది. తెలుగులో ఈ ప్రైవేట్ ఆల్బమ్‌లో మెరిసింది. ఈ పాటలో మనోడితో లవ్ ప్రపోజల్ చెప్పించుకుంటుంది. తెలుగులో సినిమాలు చేయనప్పటికీ.. బెంగాల్, ఒరియాల్లో ఫేమస్ నటినే.

ఇక విజయ్ విషయానికి వస్తే.. ఈ మధ్య వరుస చిత్రాలతో తడబడుతున్నాడు. టాక్సీ వాలా తర్వాత సరైన హిట్ పడి చాలా కాలమైంది. ఖుషీ ఓకే అనిపించినా.. అది చాల్లేదు ఫ్యాన్స్‌కు. తాజాగా ఫ్యామిలీ స్టార్ చేసినా.. ఫ్యామిలీలను కూడా మెప్పించలేకపోయింది. ఇక కల్కి 2898ఏడీలో అర్జున పాత్రలో మెరిశాడు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు ప్రాజెక్టులు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వీడీ 12 చేస్తున్నాడు. ఇందులో డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు విజయ్. అలాగే టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత ఈ ఇద్దరి నుండి రాబోతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇది . ఈ రెండు వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mallobika Banerjii (@malobika_m.j)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş