iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” రిలీజ్

  • Published Nov 15, 2024 | 4:46 PM Updated Updated Nov 15, 2024 | 4:46 PM

Sahiba Music Video: తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత గీత గోవిందం మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ.

Sahiba Music Video: తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత గీత గోవిందం మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ.

  • Published Nov 15, 2024 | 4:46 PMUpdated Nov 15, 2024 | 4:46 PM
విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” రిలీజ్

తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ తర్వాత యూత్ లో రౌడీ హీరోకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.  ప్రస్తుతం  విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో నటిస్తున్న విష‌యం తెలిసిందే.  ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఛాట్ బస్టర్స్‌లో నిలిచిన “హీరియే” సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి  ముందుకొచ్చారు.  ‘సాహిబా’ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు.  విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించారు. ఈ జంట స్క్రీన్ ప్రెజెన్స్ “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల ఈ ఆల్బ‌మ్ నుంచి ప్రోమో విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఇప్పుడు  ఫుల్ వీడియోను పంచుకున్నారు.

“సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో “సాహిబా” పాటను శ్రోతల ముందుకు తీసుకొచ్చారు జస్లీన్ రాయల్. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ పాట చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించారు.  ఈ ఆల్బమ్‌లో విజ‌య్ దేవరకొండ  ఫొటోగ్రాఫర్‌గా కనిపించ‌గా… రాధిక మదన్ రాజ‌వంశానికి చెందిన రాకుమారిగా క‌నిపించింది. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా ‘సాహిబా’ మ్యూజిక్ వీడియో సంగీత ప్రపంచంలో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ దూసుకుపోతుంది.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet