పవన్ కు అది రిస్కే అవుతుంది

పవన్ కు అది రిస్కే అవుతుంది

ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కరోనా ప్రభావం వల్ల జనసేన కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా పవన్ మూడేళ్ళ క్రితం వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ విక్రం వేదా రీమేక్ లో నటించే అవకాశం ఉందంటూ మీడియాలో బాగానే ప్రచారం జరుగుతోంది. మాధవన్ పాత్రలో రవితేజ, విజయ్ సేతుపతి క్యారెక్టర్ లో పవన్ కాంబినేషన్ లో నిర్మాత రాం తాళ్లూరి ట్రై చేస్తున్నట్టుగా దాని సారాంశం.

అయితే పవన్ నిజంగా దీని మీద ఆసక్తిగా ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే విక్రం వేదా ఒక డిఫెరెంట్ జానర్ కు చెందిన కాప్ థ్రిల్లర్. కాన్సెప్ట్. కథనం అద్భుతంగా ఉన్నప్పటికీ అది స్టార్ హీరోలు చేసే కథ కాదు . పైగా అభిమానులు, మాస్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించే పని చేస్తే అసలుకే మోసం వస్తుంది. దానికి తోడు విక్రం వేదాని మూవీ లవర్స్ ఇప్పటికే ఆన్ లైన్ లో చూసేశారు. సాధారణ ప్రేక్షకులకు అంత ఈజీగా కనెక్ట్ అయ్యేదీ కాదు. అలాంటప్పుడు విక్రం వేదా విషయంలో నిర్ణయాలు అంత వేగంగా జరగకపోవచ్చు.

అసలే పవన్ కు రీమేకులు చాలా కాలంగా కలిసి రావడం లేదు. ఒక్క గబ్బర్ సింగ్ ని మినహాయించి 2005 నుంచి చూసుకుంటే అన్నవరం, తీన్ మార్, గోపాల గోపాల, కాటమరాయుడు ఇవేవి భారీ ఫలితాలను ఇవ్వలేదు. ఒకదశలో విజయ్ తేరిని కూడా రీమేక్ చేద్దామనుకుని వేరే కారణాల డ్రాప్ అయ్యారు కాని లేదంటే ఇంకో దెబ్బ పడేదే. ఇప్పుడు విక్రం వేదా వంతు వచ్చింది. ఆల్రెడీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ నిర్మాణంలో ఉంది. ఇలా వరసబెట్టి రీమేకుల రిస్కులు చేయడం కన్నా పవన్ ఫ్రెష్ కథలను ఎంచుకోవడం బెటర్. ఫ్యాన్స్ ఆశించినట్టుగా వకీల్ సాబ్ మేలో విడుదలయ్యే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఆగష్టుకి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే కాని సినిమాలకు సంబంధించిన ఖచ్చితమైన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ లేదు. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.

Show comments