iDreamPost
android-app
ios-app

Tollywood Trailers: ఫాస్ట్ గా లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ ఇవే! పుష్ప 2 స్థానం ఎంతంటే?

  • Published Nov 18, 2024 | 4:38 PM Updated Updated Nov 18, 2024 | 4:38 PM

Tollywood Trailers: టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా లక్ష లైక్స్ అందుకున్న ట్రైలర్స్ చాలానే ఉన్నాయి. ఇక తాజాగా పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది.

Tollywood Trailers: టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా లక్ష లైక్స్ అందుకున్న ట్రైలర్స్ చాలానే ఉన్నాయి. ఇక తాజాగా పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది.

  • Published Nov 18, 2024 | 4:38 PMUpdated Nov 18, 2024 | 4:38 PM
Tollywood Trailers: ఫాస్ట్ గా లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ ఇవే! పుష్ప 2 స్థానం ఎంతంటే?

మొత్తానికి పాన్ ఇండియా ప్రేక్షకులను ఎప్పటి నుంచో ఎంతగానో ఊరిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్ రానే వచ్చేసింది. ట్రైలర్ విడుదల అవ్వడంతోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాత రికార్డులన్నీ బద్ధలు కొట్టి కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల అయిన పుష్ప 2 ట్రైలర్ కనీవినీ ఎరుగని రీతిలో వ్యూస్ రాబడుతుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి మిలియన్స్ కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ సాధిస్తూ స్పీడ్ గా దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే వ్యూస్ పరంగా ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసేసింది. వ్యూస్ పరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ హిట్ ‘గుంటూరు కారం’ ట్రైలర్‌ రికార్డుని బద్దలు కొట్టింది. ఇక లైక్స్ కూడా భారీగానే రాబట్టిన ఈ ట్రైలర్ పెద్దగా రికార్డులు బ్రేక్ చేయలేదు. ఇక అతి తక్కువ టైమ్ లో లక్ష వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటి? పుష్ప 2 ట్రైలర్ లక్ష లైక్స్ అందుకోవడానికి ఎంత టైమ్ తీసుకుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తక్కువ టైమ్ లో లక్ష వ్యూస్ రాబట్టిన ట్రైలర్ లలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా నిలిచింది. ఈ మూవీ ట్రైలర్ కేవలం మూడు నిమిషాల్లోనే ఏకంగా లక్ష లైక్స్ అందుకొని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా నిలిచింది. ఇక ఈ ట్రైలర్ కేవలం నాలుగు నిమిషాల్లో లక్ష లైక్స్ సాధించింది. ఇక మూడో స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లక్ష లైక్స్ సాధించేందుకు ఏడు నిమిషాల టైం తీసుకుంది. లాక్ డౌన్ టైమ్ లో ఇదో అన్ బీటబుల్ రికార్డుగా నిలిచింది. ఇక ఆ తరువాత 4 వ స్థానంలో ప్రభాస్ కల్కి2898AD మూవీ నిలిచింది. ఈ ట్రైలర్ కూడా ఏడు నిమిషాల్లో లక్ష లైక్స్ రాబట్టింది.

అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘RRR’ ట్రైలర్ 8 నిమిషాల్లో లక్ష లైక్స్ అందుకొని 5 వ స్థానంలో నిలిచింది. ఇక తాజాగా రిలీజైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్ కూడా 8 నిమిషాల్లో లక్ష లైక్స్ రాబట్టి 6వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా స్పీడ్ గా లక్ష లైకులు అందుకునే విషయంలో సలార్ ని బీట్ చేస్తుంది అనుకుంటే కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కానీ వ్యూస్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఏ టాలీవుడ్ మూవీ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది. ఇదీ సంగతి. మరి అతి తక్కువ టైమ్ లో ఏకంగా లక్ష లైక్స్ అందుకున్న ఈ సినిమాల ట్రైలర్ల గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss