iDreamPost
android-app
ios-app

అందాల రాశికి లవర్ బ్రేకిస్తాడా

  • Published Feb 09, 2020 | 9:20 AM Updated Updated Feb 09, 2020 | 9:20 AM
అందాల రాశికి లవర్ బ్రేకిస్తాడా

అందం అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా పాపం రాశిఖన్నాకి ఈ మధ్య ఎందుకో టైం అంతగా కలిసి రావడం లేదు. రెండేళ్ళ క్రితం వరుణ్ తేజ్ తొలిప్రేమతో పెద్ద హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా అదే సంవత్సరం శ్రీనివాస కళ్యాణం షాక్ ఇచ్చింది. ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. గత ఏడాది డిసెంబర్ లో వెంకీ మామ పర్వాలేదు అనిపించుకోగా ఏంజెల్ ఆర్ణగా ప్రతిరోజు పండగే లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ బాగానే క్లిక్ అయ్యింది. అయితే ఆశించినంత గొప్ప బ్రేక్ అని చెప్పలేం కానీ గుడ్డిలో మెల్ల తరహాలో మారుతీ తేజు తర్వాత పేరు వచ్చింది రాశి ఖన్నాకే.

కానీ ఇప్పుడీ అమ్మడి ఆశలన్నీ 14న రాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీలో తనకే ఎక్కువ వెయిట్ ఉన్న పాత్ర దక్కినట్టు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. యూనిట్ నమ్మకంగానే ఉంది కానీ బయట మాత్రం ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో బజ్ లేదు. ఒకవేళ టాక్ బాగుండి రివ్యూస్ బ్రహ్మాండంగా తెచ్చుకుంటే అప్పుడు విజయ్ దేవరకొండ ఇమేజ్ తోడై సినిమా హిట్టైపోతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా డియర్ కామ్రేడ్ కంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి.

రాశి ఖన్నా మాత్రం ఇది కెరీర్ బెస్ట్ రోల్ అని చెబుతోంది. ఎమోషన్స్ కూడా హెవీగా ఉన్నాయట. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయినట్టు ఉంది. ఒకవేళ వరల్డ్ ఫేమస్ లవర్ కనక హిట్ అయితే విజయ్ లాంటి యూత్ హీరోలకు రాశి ఖన్నా మంచి ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ ఉంది. తొలిప్రేమ మేజిక్ తరహాలో దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో ఇంకే సినిమా ఒప్పుకోలేదు. తమిళ్ లో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అక్కడ ఆఫర్స్ బాగానే వస్తున్నాయి కానీ గట్టి హిట్టు మాత్రం పడటం లేదు. సో ప్రపంచ ప్రేమికుడు ఏ మేరకు కాపాడతాడో వేచి చూడాలి

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş