మాస్ట్రో ఆ నమ్మకాన్ని నిలబెడుతుందా

కాకతాళీయంగా జరిగినా ఇప్పటిదాకా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకున్న తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదన్నది వాస్తవం. ఆకాశం నీ హద్దురా డబ్బింగ్ కాబట్టి కౌంట్ లోకి రాదు. నారప్పను భారీగా చూశారు కానీ మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ అయితే రాలేదు. ఇక వి, టక్ జగదీష్ ల సంగతి సరేసరి. సోషల్ మీడియాలో వీటి మీద జరిగిందంతా ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. అనుష్క నిశ్శబ్దం దెబ్బకు ప్రైమ్ కే చుక్కలు కనిపించాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కలర్ ఫోటోలు పాస్ అయ్యాయి కానీ అన్ని వర్గాలను మెప్పించినవి కావు. సో ఏ ఉదాహరణ తీసుకున్నా యునానిమస్ హిట్ టాక్ దేనికీ రాలేదన్నది వాస్తవం.

ఇప్పుడు మాస్ట్రో వంతు వచ్చింది. ఎల్లుండి అంటే 17న డిస్నీ హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్ రేంజ్ లో నిన్న సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. అన్ని ఫంక్షన్ల లాగే ఇందులోనూ యూనిట్ సభ్యులంతా దీని మీద గట్టి నమ్మకం వ్యక్తం చేశారు కానీ ప్రీమియర్ పడ్డాకే ఒక కంక్లూజన్ కి రావొచ్చు. దీనికున్న చిక్కు ఏంటంటే మాస్ట్రో ఒరిజినల్ వెర్షన్ అందాదున్ ని రెగ్యులర్ గా హిందీ సినిమాలు చూసే తెలుగు ఆడియన్స్ ఎప్పుడో చూశారు. సో కథ పరంగా వాళ్లకు ఎలాంటి థ్రిల్స్ ఉండవు. బాలీవుడ్ మూవీస్ అలవాటు లేని రెగ్యులర్ మూవీ లవర్స్ కి మాత్రం ఇది కొత్తగా ఉంటుంది.

పైన చెప్పినట్టు ఓటిటిలో హిట్లు రావడం లేదన్న నెగటివ్ సెంటిమెంట్ ని మాస్ట్రో బ్రేక్ చేయాలి. తమన్నా పూర్తి నెగటివ్ షేడ్ క్యారెక్టర్ ని మొదటిసారి పోషించడం ఆసక్తిని రేపుతోంది. కొన్ని కీలక మార్పులు చేశామని దర్శకుడు మేర్లపాక గాంధీ చెబుతున్నారు కానీ అవేంటన్నది సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. కళ్లులేని హీరో పాత్రను చూసి చాలా కాలమైన నేపథ్యంలో ఇది ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి. చెక్, రంగ్ దే ఇలా వరసగా రెండు ఫ్లాపులు చవిచూసిన నితిన్ కు ఇప్పుడీ మాస్ట్రో సక్సెస్ చాలా కీలకం

Also Read : తమిళ హీరో ప్లానింగ్ మాములుగా లేదు

Show comments