iDreamPost
android-app
ios-app

Balagam Venu: ‘బలగం’ వేణు డైరెక్షన్ లో నితిన్, విశ్వక్?

  • Published Aug 13, 2024 | 4:47 PM Updated Updated Aug 13, 2024 | 4:47 PM

బలగం మూవీ తర్వాత వేణు పూర్తిగా డైరెక్షన్ పైనే దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఓ పక్కా కమర్షియల్ మూవీని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోలు నితిన్ లేదా విశ్వక్ సేన్ లలో ఎవరో ఒకరు నటించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

బలగం మూవీ తర్వాత వేణు పూర్తిగా డైరెక్షన్ పైనే దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఓ పక్కా కమర్షియల్ మూవీని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోలు నితిన్ లేదా విశ్వక్ సేన్ లలో ఎవరో ఒకరు నటించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 13, 2024 | 4:47 PMUpdated Aug 13, 2024 | 4:47 PM
Balagam Venu: ‘బలగం’ వేణు డైరెక్షన్ లో నితిన్, విశ్వక్?

‘బలగం’ సినిమాతో ఇండస్ట్రీ మెుత్తాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు జబర్దస్త్ కమెడియన్ వేణు. తొలి సినిమాతో డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక కలెక్షన్ల పరంగానే కాకుండా.. అవార్డుల పరంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక నెక్ట్స్ మూవీ న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడు అన్న వార్తలు వైరల్ గా మారాయి. ఎల్లమ్మ అనే స్టోరీని నానికి చెప్పాడని, కథ నచ్చి న్యాచురల్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దాంతో వేరే హీరోల వేటలో పడ్డాడు వేణు. ఈ క్రమంలోనే యంగ్ హీరోస్ నితిన్, విశ్వక్ సేన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

బలగం మూవీ తర్వాత వేణు పూర్తిగా డైరెక్షన్ పైనే దృష్టిపెట్టాడు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ‘ఎల్లమ్మ’ అనే కథను నానికి వినిపించాడు. ఇద్దరి మధ్య టాక్స్ కూడా నడిచాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దాంతో మరో హీరోకి కథ చెప్పే ప్రయత్నంలో యంగ్ హీరోలు అయిన నితిన్, విశ్వక్ సేన్ లకు స్టోరీ నెరేట్ చేశాడట వేణు. ఆ కథ ఇద్దరి హీరోలకూ నచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరు వేణుతో మూవీ చేస్తారు? అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే? నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

మరోవైపు విశ్వక్ సేన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. విశ్వక్ చేతిలో ప్రస్తుతం 4 సినిమాలు ఉన్నాయి. వేణు కథ విపరీతంగా నచ్చినా.. ఆ సినిమాలు పూర్తి అయితే గానీ.. వీరి చిత్రం పట్టాలెక్కదు. నితిన్ మాత్రం తన నెక్ట్స్ మూవీ తర్వాత ఏ ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి.. వేణు సినిమాను తమ్ముడు చిత్రం పూర్తి కాగానే, పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. దాంతో వేణు కూడా నితిన్ వైపే మెుగ్గుచూపుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ఇద్దరి హీరోల్లో ఏ హీరోతో మూవీ తెరకెక్కిన క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. అయితే ఈ హీరోలకు చెప్పింది నానికి చెప్పిన కథ కాదని తెలుస్తోంది. బలగం మూవీతో తెలంగాణ కల్చర్ ను చూపించిన వేణు.. ఈసారి పక్కా కమర్షియల్ స్టోరీని ఎంచుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ఇద్దరు యంగ్ హీరోల్లో వేణు ఎవరితో జతకడతాడో.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique