iDreamPost
android-app
ios-app

Nithiin-Naga Chaitanya: నితిన్, చైతూ.. రిస్క్ తీసుకుంటారా? వెనక్కి తగ్గుతారా?

  • Published Jul 23, 2024 | 5:15 PM Updated Updated Jul 23, 2024 | 6:09 PM

డిసెంబర్ లో థియేటర్ల దగ్గర సినిమా జాతర మెుదలుకానుంది. స్టార్ హీరోల మూవీస్ అన్నీ ఈ నెలలోనే వస్తుండటంతో.. ఇటు సినీ పండితులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నితిన్-నాగచైతన్య మాత్రం అయోమయంలో పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ లో థియేటర్ల దగ్గర సినిమా జాతర మెుదలుకానుంది. స్టార్ హీరోల మూవీస్ అన్నీ ఈ నెలలోనే వస్తుండటంతో.. ఇటు సినీ పండితులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నితిన్-నాగచైతన్య మాత్రం అయోమయంలో పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 23, 2024 | 5:15 PMUpdated Jul 23, 2024 | 6:09 PM
Nithiin-Naga Chaitanya: నితిన్, చైతూ.. రిస్క్ తీసుకుంటారా? వెనక్కి తగ్గుతారా?

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా, చేసుకుంటున్న సినిమాలు విడుదల తేదీలను ప్రకటించి.. అభిమానులకు అప్డేట్స్ ఇచ్చే పనిలో పడ్డాయి. అయితే ఎన్నడూలేనంతగా టాలీవుడ్ లో ఈ డిసెంబర్ కు సినిమాల పంచాయితీ ఎక్కువైంది. ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుండటంతో.. ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. బన్నీ, రామ్ చరణ్ పరిస్థితి ఒకెత్తు అయితే.. ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించిన నితిన్, నాగచైతన్యలతి మరొక క్లిష్టమైన పరిస్థితి. ప్రస్తుతం వీరిద్దరు అయోమయంలో పడ్డారు.

అల్లు అర్జున్ పుష్ప 2 డిసెంబర్ 6న, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కానుకగా(బహుశా డిసెంబర్ 20 లేదా 25న రావొచ్చు) విడుదల అవుతుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఇక ఇప్పటికే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప కూడా ఇదే నెలలో వస్తుందని ట్వీట్ చేశాడు. వీటితో పాటుగా నితిన్ రాబిన్ హుడ్, నాగచైతన్య తండేల్ చిత్రాలు డిసెంబర్ 20న విడుదల కాబోతున్నాయని మేకర్స్ పై సినిమాల కంటే ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ బరిలోకి రావడంతో లెక్కలన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఈ యంగ్ హీరోలు అయోమయంలో పడ్డారు.

రాబిన్ హుడ్.. నితిన్-వెంకి కుడుముల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇక నాగచైతన్య-చందు మెుండేటి కాంబోలో వస్తున్నతండేల్ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. చైతూ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 20న వస్తున్నామని ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఈ డేట్ కు వచ్చే పరిస్థితి కనిపించేలా లేదు. ఎందుకంటే? డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ ఛేంజర్, కన్నప్ప బరిలోకి దిగబోతున్నాయి. అయితే పుష్ఫతో ఎక్కువ ఇబ్బంది లేనప్పటికీ.. గేమ్ ఛేంజర్ తో ఇబ్బంది తప్పేలా లేదు. ఇన్ని సినిమా మధ్యలో వస్తే కలెక్షన్లు తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలోకి దిగితే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ధైర్యం చేసి ఈ యంగ్ హీరోలు డిసెంబర్ లోనే బరిలోకి దిగుతారా? వెనక్కి తగ్గుతారా? అన్నది వేచిచూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom