iDreamPost
android-app
ios-app

తండ్రైన నితిన్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని!

  • Published Sep 06, 2024 | 6:09 PM Updated Updated Sep 06, 2024 | 6:09 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య షాలిని కందుకూరి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నితిన్.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆయన భార్య షాలిని కందుకూరి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు నితిన్.

  • Published Sep 06, 2024 | 6:09 PMUpdated Sep 06, 2024 | 6:09 PM
తండ్రైన నితిన్.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని!

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. ఈ రోజు ఆయన భార్య షాలిని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. ఈ విషయాన్ని నితిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘వెల్కమ్ ద న్యూ స్టార్ ఆఫ్ అవర్ లైఫ్’ అంటూ ఓ పిక్ పంచుకున్నాడు. నితిన్ కు బాబు పుట్టిన విషయం తెలియగానే సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ నటి సమంత, దర్శకుడు వెంకీ అట్లూరి శుభాకాంక్షలు తెలియజేశారు. నితిన్, ప్రేయసి షాలిని వివాహం 2020లో జులై 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో  జరిగింది. ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నందున.. నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్,నూర్జహాన్‌ల కూతురు షాలిని కందుకూరి, నితిన్‌కు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత వీరి జీవితంలోకి కొడుకు రూపంలో మరో వ్యక్తి వచ్చి చేరాడు. ప్రస్తుతం నితిన్ రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు మూవీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ మూవీతో ఒకప్పటి స్టార్ నటి లయ చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by N I T H I I N (@actor_nithiin)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom