iDreamPost
android-app
ios-app

వీడియో: డెడ్ పూల్ రేంజ్ లో డ్యాన్స్ ఇరగదీసిన నభా నటేశ్!

  • Published Aug 12, 2024 | 6:13 PM Updated Updated Aug 12, 2024 | 6:13 PM

Nabha Natesh Recreated Deadpool Wolverine Dance Beat: నభా నటేష్ తన ఫాలోవర్స్ కి ఒక ట్రీట్ ఇచ్చింది. డెడ్ పూల్ ఓల్వరిన్ మూవీలో ఉన్న డ్యాన్స్ బీట్ ని రీక్రెట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె వేసిన డెడ్లీ మూవ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Nabha Natesh Recreated Deadpool Wolverine Dance Beat: నభా నటేష్ తన ఫాలోవర్స్ కి ఒక ట్రీట్ ఇచ్చింది. డెడ్ పూల్ ఓల్వరిన్ మూవీలో ఉన్న డ్యాన్స్ బీట్ ని రీక్రెట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె వేసిన డెడ్లీ మూవ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 12, 2024 | 6:13 PMUpdated Aug 12, 2024 | 6:13 PM
వీడియో: డెడ్ పూల్ రేంజ్ లో డ్యాన్స్ ఇరగదీసిన నభా నటేశ్!

నభా నటేష్.. ఈ టాలెంటెండ్ యంగ్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కన్నడలో శివరాజ్ కుమార్ సరసన వజ్రకాయ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడలో మరో సినిమా చేసింది. ఒక క్యామియో కూడా ఉంది. తర్వాత మాత్రం టాలీవుడ్ కి వచ్చేసింది. ఇక్కడ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ తో నభా నటేష్ కు మంచి గుర్తింపు లభించింది. రామ్ పోతినేని లవర్ గా.. ఒక ఊరమాస్ అమ్మాయిగా నభా నటేష్ చేసిన యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇటీవల ప్రియదర్శితో కలిసి డార్లింగ్ అనే మూవీ చేసింది. మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో.. నభా నటేష్ లేడీ అపరిచితుడి పాత్రలో మెప్పించింది. ఇప్పుడు డార్లింగ్.. డెడ్ పూల్ అవతారం ఎత్తేసింది. ఆమె చేసిన ఈ డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ఇటీవల కాలంలో వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా డెడ్ పూల్- ఓల్వరిన్ మూవీ అనే చెప్పాలి. యాక్షన్, కామెడీ, ఎమోషన్, ఎలివేషన్స్ ఉన్న ఈ సినిమాకి ప్రేక్షకులు మంత్రముగ్దులై పోయారు. ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే 4,565 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అందరినీ వావ్ అనేలా చేసింది. సాధారణంగా డెడ్ పూల్ అంటే హీరో డైలాగ్స్, క్రేజీ మీమ్స్ తో వచ్చే తెలుగు డబ్బింగ్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి డెడ్ పూల్ ఓల్వరిన్ చిత్రంతో.. ఒక డ్యాన్స్ మూవ్ కూడా చేసి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. మూవీ స్టార్టింగ్ లో వచ్చే ఈ డ్యాన్స్ బీట్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వచ్చేసింది. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ కూడా చేరింది. డెడ్ పూల్ చేసిన డ్యాన్స్ బీట్ ని రీ క్రియేట్ చేసింది.

క్యూట్ గా ఉండంటం.. అల్లరి చేయడం మాత్రమే కాకుండా.. తనలో ఒక బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నట్లు నభా నటేష్ చెప్పకనే చెప్పింది. డెడ్ పూల్ x డార్లింగ్ అంటూ ఆ డ్యాన్స్ బీట్ ని నభా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసింది. ఆమె ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే వేలల్లో లైక్స్.. లక్షల్లో వ్యూస్ వచ్చేశాయి. డార్లింగ్ మూవీ నుంచి ఇంకా నభా నటేష్ బయటకు రాలేదు అనిపిస్తోంది. అంటే డార్లింగ్ అని కోట్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. ఇలా డెడ్ పూల్ ని గుర్తు చేస్తూ తన డ్యాన్స్ తో మెప్పించింది. మరి.. నభా నటేష్ కిల్లర్ మూవ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet