iDreamPost
android-app
ios-app

కీర్తి మనసు మార్చుకుంటుందా

  • Published Apr 26, 2020 | 10:09 AM Updated Updated Apr 26, 2020 | 10:09 AM
కీర్తి మనసు మార్చుకుంటుందా

మహానటి వచ్చాక అంతకుముందు సినిమాలు ఎంత పెద్ద హిట్టయినా దీంతో వచ్చిన గుర్తింపు హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎందులోనూ దక్కలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కు దీని ద్వారా ఎంత చేరువయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలోనే సావిత్రి గారి మీద గౌరవంతో నాగ అశ్విన్ చెప్పిన విధానం నచ్చి ఒప్పుకున్నానని ఇకపై బయోపిక్ లు చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ గుర్తే. తాజాగా గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ గా పేరు తెచ్చుకున్న అత్యధిక తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన ఒకే మహిళా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత విజయనిర్మల గారి జీవితగాధను తెరకెక్కించాలని సీనియర్ నటుడు ఆమె అబ్బాయి నరేష్ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు కీర్తి సురేష్ వద్దకు ప్రతిపాదన కూడా వెళ్లిందట. అటువైపు నుంచి ఏం సమాధానం వచ్చిందో ఇంకా తెలియలేదు. బయోపిక్ లు చేయనని చెప్పిన కీర్తి ఇప్పుడు మనసు మార్చుకుంటుందా అనేది వేచి చూడాలి. కానీ మహానటి సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అందులో ఉన్న డ్రామా ప్లస్ ట్రాజెడీ. గొప్ప నటిగా వెలిగి అవసాన దశలో సావిత్రి గారు అలా కన్నుమూయడం ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే విజయనిర్మల గారి జీవితంలో ఇలాంటి మలుపులు ఉండవు, నటిగా డైరెక్టర్ గా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చక్కని లైఫ్ ని ఆస్వాదించారు.

సూపర్ స్టార్ కు కృష్ణ సతీమణిగానూ ఆఖరి దశ వరకు ఏ లోటుపాట్లు చూడలేదు. మరి అలాంటప్పుడు మహానటి తరహాలో ఎమోషనల్ మేజిక్ చేయడం విజయనిర్మల బయోపిక్ తో సాధ్యపడక పోవచ్చు. ఇదంతా ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న గాసిప్ గానే తీసుకోవాలి. మహానటి తర్వాత కీర్తి సురేష్ టైటిల్ పాత్ర చేసిన మిస్ ఇండియా ఈ నెలలోనే విడుదల కావాల్సింది. కరోనా లాక్ డౌన్ వల్ల ఏకధాటిగా వాయిదా పడిపోయింది. డబ్బిగ్ సినిమాల్లోనే కనిపిస్తున్న కీర్తి సురేష్ కు చాలా కాలం తర్వాత చేసిన తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇదే కావడం విశేషం. అందుకే అభిమానుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/