తమన్ మునుపటి మేజిక్ కావాలి

ఎప్పుడో 2008లో పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు.

ఎప్పుడో 2008లో పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు.

టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మొదటగా వినిపించే పేరు తమన్. ఎప్పుడో 2008లో పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. నెంబర్ వన్ గా చక్రం తిప్పుతున్న మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళను దాటి మరీ దూసుకుపోవడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి హీరోతో తనకు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే 2020 అల వైకుంఠపురములో తర్వాత తమన్ లో మునుపటి మేజిక్ లేదనే కామెంట్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. గత ఏడాది అఖండ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎన్ని అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడో దాని విజయం సాక్షిగా కళ్లారా చూశాం.

కానీ ఈ సంవత్సరం తను పాటలు, బీజీఎమ్ రెండు కంపోజ్ చేసిన ఆల్బమ్స్ ఏవీ ఎవర్ గ్రీన్ అనిపించుకోలేకపోయాయి. భీమ్లా నాయక్ రెండు పాటలు హిట్ అనిపించుకుంటే సర్కారు వారి పాట అన్నేసి అంచనాల మధ్య యావరేజ్ గానే నిలిచిపోయింది. ఇక గని గురించి చెప్పాల్సిన పని లేదు. అసలది వచ్చిందన్న సంగతే జనాలు మర్చిపోయారు. నేపధ్య సంగీతం సమకూర్చిన రాధే శ్యామ్, డీజే టిల్లు, థాంక్ యులలో ఒకటి మాత్రమే విజయం సాధించింది. నిన్న విడుదలైన గాడ్ ఫాదర్ లో చిరు సల్మాన్ ల కాంబో సాంగ్ తక్కర్ మార్ మీద ఆన్ లైన్లో ట్రోల్స్ వచ్చి పడుతున్నాయి. అరుదైన కలయికకు ఇలాంటి పాటను ఎక్స్ పెక్ట్ చేయలేదని అంటున్నారు.

తమన్ కు గాడ్ ఫాదర్ ఒకటే కాదు చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రామ్ చరణ్ – శంకర్ కాంబో, బాలయ్య 107. విజయ్ వారసుడు, శివ కార్తికేయన్ ప్రిన్స్, మహేష్ బాబు త్రివిక్రమ్ ల సినిమా ఇలా ప్యాన్ ఇండియా లెవెల్ లో అందరూ తననే కోరుకుంటున్నారు. అలాంటప్పుడు బెస్ట్ ఇస్తాడనే అంచనాలే ఉంటాయి. గాడ్ ఫాదర్ టీజర్ కు సైతం కామెంట్స్ వచ్చాయి కానీ అది టైం లేకపోవడం వల్లని సర్దుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడీ తార్ మార్ కూడా సోసోగానే అనిపిస్తోంది. రేపు మొత్తం పాట వచ్చాక ఒపీనియన్లు మారితే చెప్పలేం. ఒకప్పటిలా అన్ని పాటలు బాగున్న సినిమాలు రావడం లేదని మ్యూజిక్ లవర్స్ బాధపడుతున్న సమయంలో తమన్ లాంటి వాళ్ళు తమ పూర్తి ఎనర్జీని బయటికి తీయాల్సిందే

Show comments