iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్ట్..!

  • Published Nov 06, 2023 | 5:35 PM Updated Updated Nov 06, 2023 | 5:35 PM

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ స్థాయి మరింత పెంచింది. ప్రస్తుతం సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీలో నటిస్తున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ స్థాయి మరింత పెంచింది. ప్రస్తుతం సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీలో నటిస్తున్నాడు.

  • Published Nov 06, 2023 | 5:35 PMUpdated Nov 06, 2023 | 5:35 PM
రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్ట్..!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. మొదటి చిత్రం యావరేజ్ టాక్ వచ్చినా.. రెండో చిత్రం ‘మగధీర’ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. నటించిన చిత్రాలు కొన్నే అయినా.. దాదాపు అన్నీ సూపర్ హిట్ చిత్రాలు కావడంతో రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో భారతీయ చిత్రాల ఖ్యాతి మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సాంగ్ లీక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పూ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ మూహూర్తం మొదలై చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు స్పెషల్ అప్ డేట్ ఏదీ రాలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతి హీరో అభిమాని తమ హీరో నటిస్తున్న మూవీకి గురించి ఎక్స్ క్లూజీవ్ అప్ డేట్ వినాలని, చూడాలని అనుకుంటారు. కానీ ఇటీవల కొంతమంది లీక్ రాయుళ్ల వల్ల తమ అభిమాన హీరోలు నటిస్తున్న ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి.  మేకర్స్ సెట్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొంతమంది క్యూరియాసిటీతోనో, సెన్సేషన్ కావాలనో ఇలా లీక్ చేయడం వల్ల అంచనాలు మారిపోతుంటాయి. అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఏకంగా ఓ సాంగ్ లీక్ కావడంపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.   సినిమాకు సంబంధించిన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఇందులో ఒక సాంగ్ లీక్ కావడంతో మేకర్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే సాంగ్ లీక్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు దర్యాప్తు చేసి పాట లీక్ కి సంబంధం ఉన్న ఇద్దరరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ హైలెట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. గతంలో కూడా థమన్ సినిమాలకు సంబంధించిన కొన్ని సాంగ్స్ లీక్ అవుతున్న విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş