iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు థమన్ గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి..

  • Published Mar 13, 2024 | 10:05 PM Updated Updated Mar 13, 2024 | 10:05 PM

Thaman On Game Changer Update: రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్ డేట్ అంటూ ఫ్యాన్స్ బతిమాలుకుంటున్నారు. అలాంటి వారికి థమన్ రూపంలో ఒక మంచి అప్ డేట్ దక్కింది.

Thaman On Game Changer Update: రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్ డేట్ అంటూ ఫ్యాన్స్ బతిమాలుకుంటున్నారు. అలాంటి వారికి థమన్ రూపంలో ఒక మంచి అప్ డేట్ దక్కింది.

  • Published Mar 13, 2024 | 10:05 PMUpdated Mar 13, 2024 | 10:05 PM
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు థమన్ గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి..

రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్ కి చేరింది. ఒక రీజనల్ హీరోగా కెరీర్ ప్రారంభించిన చెర్రీ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుంది? ఏ డైరెక్టర్ తో మూవీ చేస్తాడు అంటూ అంతా ఎదురుచూశారు. అలాంటి సమయంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ప్రకటించారు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్ ఆడియన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొన్ని గొప్ప సినిమాలు రావాలి అంటే గొప్ప త్యాగాలు కూడా చేయాలి. అలాంటి త్యాగాలు మెగా ఫ్యాన్స్ చాలానే చేశారు. అలాంటి ఫ్యాన్స్ కు ఇప్పుడు థమన్ గుడ్ న్యూస్ చెప్పారు.

సాధారణంగా డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే పేరు ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ కొబ్బరికాయ కొట్టేది ఎవరైనా గెస్ చేయగలరు. కానీ, ప్రాజెక్ట్ కి గుమ్మడికాయ కొట్టేది మాత్రం చెప్పడం కష్టమే అంటారు. సరే ప్రాజెక్ట్ వ్రాప్ సంగతి తర్వాత.. ముందు చిన్నాచితక అప్ డేట్స్ వస్తాయి కదా అనుకున్నారు. కానీ, అక్కడ కూడా అభిమానులకు నిరాశ తప్పలేదు. సినిమా పోస్టర్ మినహా ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. మరోవైపు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 పడవ కూడా ఎక్కారు. ఇంకేముందు గేమ్ ఛేంజర్ కాస్త వాయిదాల మీద వాయదాలు ఎలాంటి అప్ డేట్స్ లేకుండా అలాగే మిగిలిపోయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం అప్ డేట్స్ మహా ప్రభో అంటూ నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. అలాంటి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక గొప్ప శుభవార్తను అందించాడు.

Thaman about game changer song

గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి త్వరలోనే అప్ డేట్ రాబోతోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ శుభవార్త రామ్ చరణ్ బర్త్ డేకి ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ షోలో పాటలు ఎంజాయ్ చేస్తున్న థమన్ కు శ్రీముఖి ఒక చిక్కు ప్రశ్న సంధించింది. అదేంటంటే.. గేమ్ ఛేంజర్ సాంగ్స్ ఎలా ఉంటాయి? ఎప్పుడు వస్తాయి అంటూ అడిగింది. థమన్ మాత్రం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అసలు విషయం చెప్పేశాడు.

“మేము రామ్ చరణ్ కోసం ఒక పాటను రిలీజ్ చేయబోతున్నాం. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం” అంటూ థమన్ మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పేశాడు. ఇంకేముంది గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్.. అప్ డేట్ అని బెంగ పెట్టేసుకున్న అభిమానులకు థమన్ రూపంలో మార్చి 27న ఒక పెద్ద ట్రీట్ అయితే ఉండబోతోంది. ఈ వార్త విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎట్టకేలకు సినిమా నుంచి అప్ డేట్ వస్తోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా థమన్ కు థాంక్సులు చెప్పేస్తున్నారు. మరి.. గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom