సినిమాకు కథ, కథనంతో పాటుగా దానికి తగ్గట్లుగా సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ కుదిరితేనే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతుంది. అలా కాకుండా వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా.. ఆ మూవీ ఫలితం వేరేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోలకు, హీరోయిన్ లకు ఎలాగైతే అభిమానులు ఉన్నారో.. సంగీత దర్శకులకు, వారి పాటలకు ప్రత్యేకించి వారిచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ కు కూడా ఫ్యాన్ బేస్ ఉందనేది కాదనలేని వాస్తవం. అంతలా ఓ సినిమాను నడిపిస్తుంది బ్యాగ్రౌండ్ స్కోర్. ఒక్కోసారి దీనితోనే సినిమాల సక్సెస్ రేంజ్ పెరిగిందన్న మాట అతిశయోక్తికాదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు తమన్. అతడించే బ్యాగ్రౌండ్ స్కోర్ సౌండ్ కు థియేటర్లే దద్దరిల్లిపోతున్నాయి. ఇదే విషయంపై గతంలో ‘అఖండ’ మూవీ టైమ్ లో తమన్ పై థియేటర్ యజమానులు ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా మరోసారి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమన్.. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్. ఇక ఇతడి బ్యాగ్రౌండ్ స్కోర్ కు ప్రత్యేకించి ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ మూవీకి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు థియేటర్లలో పూనకాలు వచ్చాయి. ఈ మూవీకి థియేటర్లలో విడిచిపెట్టిన సౌండ్ కు ప్రేక్షకుల చెవులకు చిల్లులు పడ్డాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరోసారి తమన్ మ్యూజిక్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజాగా విడుదలైన ‘స్కంద’ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకుర్చాడు.
ఇక బోయపాటి మాస్ ఇమేజ్ కు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కలిస్తే ఎలా ఉంటుందో అఖండలో చూపించారు. ఇప్పడు స్కంద మూవీతో దాన్ని రిపీట్ చేసింది ఈ జోడీ. అయితే తమన్ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి గుంటూరు లోని ఫేమస్ థియేటర్ అయిన గౌరీశంకర్ థియేటర్ యాజమాన్యం ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో “తమన్ ను ఎవరైనా కంట్రోల్ చేయండి. అతడి సౌండ్ ఎఫెక్ట్స్ ఊహకు మించుతున్నాయి. ఆడియో డెసిబెల్ స్థాయిలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో థియేటర్ యజమానులకు ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇది మాకు ఇబ్బందిగా మారింది” అంటూ ట్వీట్ లో రాసుకొచ్చింది. దీంతో తమన్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు. అఖండ సినిమాతో తన డ్రమ్స్ రేంజ్ చూపించిన తమన్.. తాజాగా స్కందతో మరోసారి ర్యాంపేజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సౌండ్ కు థియేటర్ ఓనర్స్ బెంబేలెత్తిపోతున్నారు. అందుకే అతడిని ఎవరైనా కంట్రోల్ చేయాలంటూ విన్నవించుకుంటున్నారు. మరి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Someone needs to make an effort to control Mr. Thaman. These audio decibel levels are outrageous. An inconvenience to both us theater owners whose equipment is getting affected and the audience who are complaining about the volume levels.
— GowriShankar Theatre (@GSCinemasGnt) September 28, 2023