టాలీవుడ్ మాస్ డైరెక్టర్ ప్రస్తావన రాగానే గుర్తుకొచ్చే పేరు బోయపాటి శ్రీను. గత రెండు దశాబ్దాలుగా మాస్ మసాలా మూవీస్, కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ తీస్తూ ఎన్నో హిట్లు అందుకున్నారు బోయ. రవితేజ ‘భద్ర’, వెంకటేష్ ‘తులసి’, బాలకృష్ణ ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమాలు బోయపాటి తీసినవే. గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్సులు, కన్నీళ్లు తెప్పించే ఎమోషన్స్ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు బోయ. అందుకే ఆయన మూవీస్‌ను మాస్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇష్టపడతారు.
బోయపాటి చాలా మంది హీరోలతో కలసి పనిచేశారు. అయితే బాలకృష్ణతో ఆయన తీసిన సినిమాలు మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. బాలయ్యతో మూవీ అంటే చాలు.. హీరో క్యారెక్టర్‌ను మరింత బలంగా రాసుకుంటాడు బోయ. ఒకవైపు పవర్‌ఫుల్‌గా సాగుతూ సొసైటీ క్షేమం కోసం ఆలోచించేలా, మరోవైపు ఫ్యామిలీ కోసం ఎంతకైనా తెగించేలా పాత్రను, కథను రెడీ చేసుకుంటాడు. బాలయ్య-బోయ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్‌డూపర్ హిట్లు అయ్యాయి. వీరి కాంబోలో నెక్స్ వచ్చే మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలయ్య-బోయ కాంబోలో వచ్చిన సినిమాల్లో ‘అఖండ’ డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కరోనా టైమ్‌లో థియేటర్లకు ఆడియెన్స్ వస్తారో లేదోననే అనుమానాలు నెలకొన్నాయి. ఆ సమయంలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారు. సినిమాలో బాలయ్య యాక్టింగ్, బోయ డైరెక్షన్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించిన పాటలు, బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. అదిరిపోయే రీరికార్డింగ్‌తో థియేటర్లను షేక్ చేశాడు థమన్. ఇదే విషయం గురించి డైరెక్టర్ బోయపాటిని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా ఆయన ఆసక్తికరమైన రీతిలో సమాధానం ఇచ్చారు.
బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘స్కంద’ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘స్కంద’లో థమన్ మ్యూజిక్ అనుకున్నంత రేంజ్లో లేదని బోయపాటికి ప్రశ్న ఎదురైంది. అలాగే ‘అఖండ’ బీజీఎం ప్రస్తావన కూడా వచ్చింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మంచి వాళ్ల దగ్గర నుంచి కాస్త లేటైనా పని లాక్కోవచ్చేనేది నా ఉద్యేశం. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేస్తా. నేను కూర్చొని చేసే డీటీఎస్ క్రిస్టల్ క్లియర్లా ఉంటుంది’ అని బోయ చెప్పుకొచ్చారు.
‘అఖండ’ సినిమాకు తన మ్యూజిక్‌తో థమన్ ప్రాణం పోశాడని యాంకర్ అనగా.. ‘ఆ సినిమా ఆర్ఆర్ లేకున్నా మీరు గర్వంగా ఫీలవుతారు. దానికి అంత దమ్ము ఉంటుంది’ అని బోయపాటి పేర్కొన్నారు. దీంతో థమన్ ఫ్యాన్స్, నెటిజన్స్ బోయను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతున్నారు. థమన్ మ్యూజిక్ లేని ‘అఖండ’ మూవీని ఊహించుకోలేమని అంటున్నారు. మరి.. థమన్ బీజీఎం లేకున్నా ‘అఖండ’ సినిమా అద్భుతమే అంటూ బోయపాటి చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆ విషయంలో గ్లోబల్ బ్యూటీని శృతి మించుతుందట!
If throwing someone under the bus was an art, Boya would top it… pic.twitter.com/h9NCLMxxDd
— Sitti naidu (@sittinaidu) October 6, 2023