Venkateswarlu
బాలకృష్ణను శివుడిలా అనుకున్నా.. ఇంటర్‌వెల్ సీన్‌లో ఆయన కళ్లు తెరిస్తే.. గూస్‌బమ్స్ వచ్చాయి. కొట్టరా.. కొట్టకపోతే నువ్వు వేస్ట్ అన్నట్లు సినిమా నాకు సవాల్ ఇచ్చింది.
బాలకృష్ణను శివుడిలా అనుకున్నా.. ఇంటర్‌వెల్ సీన్‌లో ఆయన కళ్లు తెరిస్తే.. గూస్‌బమ్స్ వచ్చాయి. కొట్టరా.. కొట్టకపోతే నువ్వు వేస్ట్ అన్నట్లు సినిమా నాకు సవాల్ ఇచ్చింది.
Venkateswarlu
నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ భగవంత్ కేసరి’’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ‘భగవంత్ కేసరి’ సాధించిన విజయంతో సినిమా టీం ఫుల్ ఖుషీలో ఉంది. పలు ఇంటర్వ్యూలతో తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా, చిత్ర హీరో బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు థమన్.. దర్శకుడు బాబి నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా థమన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. ‘‘ ఓ మంచి సీన్‌ను మనం చెడపం.. బాగా ఎలివేట్ చేసే చెబుతాం.. సీన్‌లో ఎమోషన్ లేకపోతే ఎంత కొట్టినా వర్కవుట్ కాదు.. నేను కాదు.. ఎవడి వల్లా అవ్వదు. నువ్వు చచ్చిన శవాన్ని తీసుకువచ్చి బతికించమంటే ఎలా?.. అంతే లాజిక్ ఇక్కడ. రివ్యూలు ఇష్టానికి రాసేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటారు కానీ.. అక్కడ మ్యాటర్ లేకపోతే నేను ఏం చేయను. అక్కడ వాళ్లు ఇవ్వాలి. అనిల్ మంచి సినిమా ఇచ్చాడు. అఖండ కూడా వర్కవుట్ అయింది. బాలకృష్ణను శివుడిలా అనుకున్నా.. ఇంటర్‌వెల్ సీన్‌లో ఆయన కళ్లు తెరిస్తే.. గూస్‌బమ్స్ వచ్చాయి.
కొట్టరా.. కొట్టకపోతే నువ్వు వేస్ట్ అన్నట్లు సినిమా నాకు సవాల్ ఇచ్చింది. అలా ఉండాలి సినిమాలు అనేవి’’ అని అన్నారు. అయితే, ఈ కామెంట్లు దర్శకుడు బోయపాటి శ్రీనును ఉద్దేశించే థమన్ అన్నాడన్న ప్రచారం జరుగుతోంది. థమన్ నిజంగానే బోయపాటిని ఉద్ధేశించి ఈ కామెంట్లు చేశాడా? లేదా? అన్నది తెలియరావాల్సి ఉంది. ఇక, బోయపాటి- థమన్ కలిసి తాజాగా, వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి, థమన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.