iDreamPost
android-app
ios-app

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వులను ఎందుకు వెనక్కి తీసుకుంది..? : అందుకు గల కారణం ఏంటీ..?

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వులను ఎందుకు వెనక్కి తీసుకుంది..? : అందుకు గల కారణం ఏంటీ..?

ఇటీవలి కరోనా వైరస్ నేపథ్యంలో స్వదేశీ వస్తువుల అంశం మరోసారి చర్చకు వస్తుంది. ప్రధాని మోడీ ఇటీవలి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు “లోకల్ ఓకల్” నినాదాన్ని పిలుపిచ్చారు. అంటే స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి…స్వదేశీ గిరాకీ ని పెంచాలని ఆ ప్రకటనలోని సారాంశం. అయితే ఇది సాధ్యమా..? అసాధ్యమా..? అనే ప్రశ్న పక్కనపెడితే…ప్రధాని మోడీ ప్రకటనను కేంద్ర హోం మంత్రిత్వ మాత్రం వెంటనే ఆచరణలో పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే పారా మిలటరీ క్యాంటీన్లలో స్వదేశీ వస్తువులను మాత్రమే అమ్మకాలు నిర్వహించాలి…విదేశీ దిగుమతుల అమ్మకాలను ఆపాలి అని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇది కూడా వివాదాస్పదం అయింది. ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్లు హోం శాఖ మంత్రి ఒక సందర్భంలో పేర్కొన్నారు. అయితే హోం మంత్రి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో అలా ఏమీ లేదని, విదేశీ దిగిమతుల అమ్మకాలను జరపమని మళ్లీ సంజాయిషీ ఇచ్చుకున్నారు.

‘’మేడ్ ఇన్ ఇండియా’’లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000 పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

పారామిలిటరీ క్యాంటీన్‌లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘’నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్‌ఫిగర్ షర్ట్స్‌, అడిడాస్ బాడీ స్ప్రే’’లు వంటి బ్రాండ్‌లు ఉన్నట్లు గమనించారు. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. 

ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి 1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి. కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి. కేటగిరి 3- పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. ఇలా పారా మిలిటరీ క్యాంటీన్లలో విదేశీ దిగుమతుల అమ్మకాలపై నిషేధం ఉంటుంది.