iDreamPost
దీని పై అమరరాజా యజమాన్యం హై కోర్టుకు పోవడంతో హై కోర్టు కాలుష్య నియంత్రణ మండలి నోటీసుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాల పై స్టే విధించమని కోరుతూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది అమరరాజా యజమాన్యం.
దీని పై అమరరాజా యజమాన్యం హై కోర్టుకు పోవడంతో హై కోర్టు కాలుష్య నియంత్రణ మండలి నోటీసుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాల పై స్టే విధించమని కోరుతూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది అమరరాజా యజమాన్యం.
iDreamPost
రానున్న పదేళ్లల్లో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెడతామని గల్లా జయదేవ్ వ్యాఖ్యనించటం వెనక తరువాతి పదేళ్లు కూడా ఎపిలో టీడీపీ అధికారంలోకి రాదు అన్న ఉద్దేశ్యం ఉందా?
అమరరాజా కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యం వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, భూగర్భ జలం కూడా కలుషితమయ్యి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు పలువురి విజ్ఞప్తి మేరకు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ఫేక్టరీ వ్యర్ధాల వలన, వాతావరణ, భూగర్భ జల కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాటు ఫ్యాక్టరీ ఉద్యోగుల, పరిసర ప్రాంత ప్రజల శరీరాల్లో విషపూరిత పదార్ధాలు పరిమితికి మించి పెరిగిపోవడంతో నిర్ధేశిత గడువులోగా కాలుష్యం అదుపు చేయాలన్న ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞలు కూడా పాటించకపోవడంతో సంస్థకు క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.
దీని పై అమరరాజా యజమాన్యం హై కోర్టుకు పోవడంతో హై కోర్టు కాలుష్య నియంత్రణ మండలి నోటీసుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హై కోర్టు ఆదేశాల పై స్టే విధించమని కోరుతూ సుప్రీం కోర్టు మెట్లెక్కింది అమరరాజా యజమాన్యం.
సదరు పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం హై కోర్టు ఆదేశాల పై స్టే ఇస్తూ అమరరాజా కంపెనీ పై విధమైన చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణకు హాజరు కావాలని ఎపి కాలుష్య నియంత్రణ మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎపి విద్యుత్ శాఖకి ఆదేశాలు జారీ చేసింది.
ఇంత కాలుష్యనికి కారకమయ్యి, కోర్టు వివాదంలో ఉన్న కంపెనీ మళ్ళీ అదే ప్రాంతంలో అదే కాలుష్య కారక కంపెనీకి అనుమతులు ఎలా తెచ్చుకోగలుగుతుంది. ప్రతిపక్ష ఎంపీ కూడా అయ్యిన గల్లా జయదేవ్ చట్టానికి లోబడి అయితే గతంలో ఉన్న కాలుష్యం పై పిర్యాదులు, కోర్టు కేసులు, ఇతర భూ కబ్జా వివాదాల మూలంగా రాష్ట్రంలో అనుమతులు కష్టమని తలచి ఉండొచ్చు.
ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. టీడీపీ ప్రచారం చేస్తున్న విధంగా వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడి టీడీపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే ఈ ఒక్క యాడాది ఓపిక పట్టి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కాలుష్య నిభందనలు కాలరాచి స్వంత ప్రాంతంలో పెట్టుబడి పెట్టుకొనేవాడు కదా …
ఈ ప్రకారం చూస్తే యాడాది తర్వాత ఎన్నికల్లో టీడీపీ గెలవడం అంటుంచి రానున్న పదేళ్లల్లో కూడా టీడీపీ అధికారంలోకి రావటం అసాధ్యమని నిర్ణయించుకొన్న తర్వాతే గల్లా జయదేవ్ రానున్న పదేళ్లలో తెలంగాణాలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించి ఉండొచ్చు.
విశేషం ఏంటంటే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఏనాడూ విభజన హక్కుల గురించి, ప్రత్యేక హోదా గురించి, హోదాతో రావాల్సిన నిధులు, సంస్థల గురించి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్యాకేజికి ఒప్పుకొని అసెంబ్లీలో ధన్యవాద తీర్మాణం చేసింది టీడీపీ ప్రభుత్వం అదే టీడీపీ 2018 లో బిజెపితో పొత్తు నుండి బయటకు వచ్చిన తర్వాత పార్లమెంట్ లో బిజెపికి వ్యతిరేకంగా ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలంగాణాకు ఆస్తులు, ఎపికి అప్పులు పంచారని కేంద్రం పై ఆరోపిస్తూ, ఎపికి రావాల్సి తెలంగాణా ఆధీనంలో ఉన్న ఆస్తులు, రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఆవేదన వెళ్ళగక్కాడు.
తెలంగాణా ప్రభుత్వంతో సాన్నిహిత్యం ఏర్పరుచుకొని అక్కడ వేల కోట్లు పెట్టుబడులు పెడతానని, వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా సేవకుడు, టీడీపీ నాయకుడు ఆ రోజు తెలంగాణా నుండి తన రాష్ట్రనికి రావాల్సిన బకాయిలు గురించి మళ్ళీ అడిగి ఈ రోజు ఉన్న సాన్నిహిత్యంతో సానుకూలంగా తెస్తాడా?. లేక రాష్ట్ర ప్రజల కన్నా, ప్రజా సేవ కన్నా తన వ్యాపారమే తనకు ముఖ్యం అనుకొంటాడా?. వేచి చూడాలి.