iDreamPost
android-app
ios-app

75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. సీఎం జగన్ కీలక నిర్ణయం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువత కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. చదువుకునే దశ నుంచి ఉద్యోగాలు పొందే వరకు.. వివిధ రకాల పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అలానే  యువతకు ఉద్యోగావకాశలను కల్పించేందుకు వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. తాజాగా ఉద్యోగాల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాలని సీఎం స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమలవుతుందని తెలిపారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్పకుండా ఆరు నెలలకు ఒకసారి రిపోర్టు పంపాలని కలెక్టర్లకు సూచించారు.

మంగళవారం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ.13,295 కోట్ల పెట్టుబడులతో 10 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించే పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఈ మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని, భూములు, ఇతర వనరులను సమకూరుస్తున్నామని సీఎం తెలిపారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..” ఒక పరిశ్రమ ఏర్పాటై.. అభివృద్ధి పథంలో నడవాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరం. స్థానిక ప్రజల మద్దతుతోనే పరిశ్రమలో సమర్ధవంతగా నడుస్తాయి. అందుకనే అన్నిరకాల పరిశ్రమలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. అదే విధంగా స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నాము. రాష్ట్రంలో నైపుణ్యాలకు కొదవలేదు. అలానే మానవ వనరులు సరిపడ ఉన్నాయి” సీఎం తెలిపారు. ఎస్ఐపీబీ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు  ఉన్నతాధికారులు పాల్గొన్నా హజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐపీబీ వివిధ ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఆమెదం తెలిపింది. మరి.. ఉద్యోగల విషయం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి:  తనకు క్యాన్సర్ ఉందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన కొడాలి నాని!