iDreamPost
android-app
ios-app

లోకేశ్ పాదయాత్రలో కనిపించని టీడీపీ ఎంపీలు! అదే కారణం…

లోకేశ్ పాదయాత్రలో కనిపించని టీడీపీ ఎంపీలు!  అదే కారణం…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్నా సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో  పాదయాత్రను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. ఏ జిల్లాలో లోకేశ్ యాత్ర కొనసాగితే..ఆ జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు పాల్గొంటున్నారు. అయితే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో  జరుగుతోన్న యాత్రలో ఓ విషయంపై అందరూ చర్చింకుంటున్నారు. కారణంగా  ఆ రెండు జిల్లాలో ఉన్న  ఇద్దరు టీడీపీ ఎంపీలు లోకేశ్ పాదయాత్రలో కనిపించలేదు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన ప్రభజనం గురించి అందరికి తెలిసిందే.  ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో టీడీపీ కొట్టుకుపోయింది. 175 స్థానాలకు గాను కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఎంపీ స్థానాల్లోను వైసీపీ హవా కొనసాగింది. 25 లోక్ సభ స్థానాలకు గాను 22 గెలుచుకుంది.  అయితే ఇంతటి జగన్ సునామిలో కూడా టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలిచారు. వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని,  శ్రీకాకుళం ఎంపీ  రామ్మోహన్ నాయుడు. వీరిలో  గుంటూరు, విజయవాడ ఎంపీలు లోకేశ్ పాదయాత్రలో కనిపించలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నట్లు రాజకీయా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మొదటగా విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయానికి వస్తే.. ఆయనకు, టీడీపీకి కొంతకాలం నుంచి పొసగటం లేదు. అంతేకాక విజయవాడ పార్లమెంట్ నియోజవర్గ ఇన్ ఛార్జ్ గా నాని సోదరుడు చిన్నిని టీడీపీ అధినాయకత్వం ప్రకటించింది. దీంతో కేశినేని నానికి మరింత ఆగ్రహం తెప్పించిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలానే విజయవాడలోని పలువురు టీడీపీ నేతలతో కేశినేని నానికి విబేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను స్వతంత్ర అభ్యర్ధిగా అయిన గెలిచే సత్తా ఉందంటా గతంలో ఓ సారి కేశినేని నాని చెప్పాడు. అంతేకాక నన్ను విమర్శించే గొట్టం గాళ్లు ఆ ప్లెక్సీలో ఉన్నారంటూ ఓ సందర్భంలో విజయవాడ లోని కొందరు టీడీపీ నేతలపై సీరియస్ అయ్యారు. అంతేకాక టీడీపీ అధినేత చంద్రబాబుకు, కేశినేని నానికి మధ్య దూరం బాగా పెరిగిందని కొందరు  అంటున్నారు.  అలా చాలా కాలం నుంచి టీడీపీకి దూరంగా ఉండటం కారణంగానే లోకేశ్ పాదయాత్రలో విజయవాడ ఎంపీ కనిపించడలేదు.

ఇంక మరో ఎంపీ గల్లా జయదేవ్. గల్లా అరుణకుమారి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గల్లా జయదేవ్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తొలుత టీడీపీలో యాక్టీవ్ గా పని చేసిన గల్లా జయదేవ్ ఆ తరువాత కాలంలో కాస్తా స్లో అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు పార్టీ కార్యక్రమాలకు యాక్టీవగా పాల్గొనే ఆయన.. ఇప్పుడు కేవలం పార్లమెంట్ లో మాత్రమే తన గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు చెందిన అమర రాజా గ్రూప్‌ పై అధికారులు దాడులు చేశారు. వివిధ రకాల అనుమతులను ఉల్లంఘించారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటే.. తన వ్యాపారం దెబ్బతింటుదనే భావనలో ఉన్నట్లు,  అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరికొందరు ఇంకో వాదనను తెరపైకి తెచ్చారు. చంద్రగిరి అసెంబ్లీ స్థానాన్ని గల్లా జయదేవ్ ఆశించారు. అయితే గల్లాను కాదని పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా లోకేశ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గల్లా జయదేవ్ సీరియస్ అయ్యినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి లోకేశ్ తో అంటీముట్టనట్లు జయదేవ్ వ్యవహరిస్తున్నారంట. తాజాగా గుంటూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్ర చేరుకున్నా అటువైపు గల్లా కన్నెత్తి కూడ చూడకపోవడానికి అదే కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏదీ ఏమైనా టీడీపీ ప్రతిష్టాత్మంగా చేపట్టిన లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆ ఇద్దరు ఎంపీలు పాల్గొనకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని! కాంట్రవర్సీపై క్లారిటీ!