iDreamPost
కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తమ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణాలో ఓ కొత్త ప్లాంట్ కి పునాది వేయడం, రానున్న పదేళ్లలో తెలంగాణాలో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించడం తెలిసిన విషయాలే . ఈ అంశాన్ని బూచిగా చూపి వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే అమరారాజా సొంత రాష్ట్రాన్ని కాదని తెలంగాణాలో పెట్టుబడులు పెడుతుందని టీడీపీ, ఎల్లో మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసాయి.

ఇటీవలి కొన్ని పరిణామాలు, టీడీపీ ఎదుర్కొంటున్న సంక్లిష్టతలు వాటిని ఎదుర్కోవటంలో తడబాటు, వరుసగా బయట పడుతున్న స్కాములు చూస్తుంటే అవుననే చెప్పాలి.
కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తమ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణాలో ఓ కొత్త ప్లాంట్ కి పునాది వేయడం, రానున్న పదేళ్లలో తెలంగాణాలో తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించడం తెలిసిన విషయాలే . ఈ అంశాన్ని బూచిగా చూపి వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే అమరారాజా సొంత రాష్ట్రాన్ని కాదని తెలంగాణాలో పెట్టుబడులు పెడుతుందని టీడీపీ, ఎల్లో మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసాయి.
అయితే ఇక్కడే అత్యుత్సాహంతో వెనకా ముందూ చూసుకోకుండా చేసిన ప్రచారంతో తమ భావి ఓటమిని తామే బయట పెట్టుకున్నట్టు అయ్యింది.
ఏడాదికి ఒకట్రెండు నెలలు అటూఇటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ చెబుతున్నట్టు వైసీపీ పాలన పట్ల, పారిశ్రామిక విధానాల పట్ల, వేధింపుల పట్ల జనాలు విసిగి వేసారి ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గెలిపించే పని అయితే యాడాదిలో వైసీపీ దిగిపోయి టీడీపీ వస్తుంది కదా. అప్పటీ వరకూ ఒక్క యాడాది ఓపికబట్టి ఆ వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోనే పెట్టి ఉద్యోగాల కల్పన, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేట్టు చేయొచ్చు కదా . మరెందుకు ఏకంగా పదేళ్ల పాటు వేల కోట్లు తెలంగాణాలో పెడుతున్నట్టు….
అంటే వచ్చే ఎన్నికల్లోనే కాదు, రానున్న పదేళ్లల్లో కూడా తమకు అనుకూలమైన టీడీపీ అధికారంలోకి రావటం కల అని అమరరాజా యజమాన్యం నిర్ణయించుకొందా .
అమరరాజా యజమాన్యం అంటే మరెవరో కాదు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలకమైన గల్లా కుటుంబం. ఆ కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన ప్రస్తుత గుంటూరు పార్లమెంట్ సభ్యుడు టీడీపీ నేత గల్లా జయదేవ్ .
టీడీపీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న 2019 ఎన్నికలలో ఆ వ్యతిరేకతని తట్టుకొని గెలిచిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రానున్న పదేళ్లలో తమ పార్టీ అధికారంలోకి రాదని, తన వ్యాపారానికి అనుకూలమైన నిర్ణయాలు ఉండవని అర్ధం చేసుకొని తన వ్యాపార విస్తరణకు తెలంగాణా తరలిపోయాడు అని పసి పిల్లోడికి సైతం అర్ధమయ్యేలా టీడీపీ శ్రేణులు అనుకూల మీడియానే ప్రచారం చేశారు.
గతంలో కూడా అమరరాజా కంపెనీ మొత్తం తమిళనాడుకి తరలిపోతుందని ఇందుకు ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ వర్గాలు, ఎబియన్ ఇతర ఎల్లో మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. అయితే ఇలాంటి వదంతులకు , వివాదాస్పద అంశాలకు తాము దూరంగా ఉంటామని, పర్యావరణ సమస్యలు , క్లోజింగ్ ఆర్డర్స్ లాంటి విషయాలు కోర్టు పరిధిలో ఉన్నందున దాని పై బయట స్పందించలేదని కోర్టుకి సమాధానమిచ్చి , కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు . ఈ విషయమై తాము స్పందించకుండానే వివిధ పత్రికల్లో , ఇతర మాధ్యమాల్లో వార్తలు వచ్చాయని అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనన్నారు .
తన ప్రమేయం లేకుండా తన కంపెనీ పేరుని టీడీపీ దుస్ప్రచారానికి వాడుకొందని మనస్థాపం చెందారో ఏమో కానీ నాటి నుండి టీడీపీ అధికారిక కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కాకుండా అంటిముట్టనట్టు వ్యవహారిస్తున్న ఎంపీ జయదేవ్ ఈ నిర్ణయంతో రానున్న పదేళ్లలో టీడీపీ అధికారంలోకి రాదని ఫిక్షయ్యి తనదారి తాను చూసుకొన్నాడని టీడీపీ మీడియానే తేల్చి చెప్పింది.