Idream media
Idream media
ఒక్క పేరు.. ఆ ఒక్క పేరును ఇంటి పేరుతో సహా ఎందుకు పలకలేకపోయారు..? సీనియర్ జర్నలిస్టు, పైగా పలు ఛానెళ్లలో లైవ్ డిబేట్లు నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రా అర్నబ్ గోస్వామిగా పిలుపించుకునేందుకు ఇష్టపడే వ్యక్తి అయిన వెంకట కృష్ట.. ఆ పేరు వచ్చిన సమయంలో నోరు ఎందుకు తడబడింది..? ఎందుకు నీళ్లు నమిలారు..? ఇదీ మంగళవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఏమిటా పేరు..? ఏమిటా కథ..?
హైకోర్టు తీర్పులపై వ్యాఖ్యానాలు చేసిన వారిపై ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కారం కింద వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి, సినీ విళ్లేషకుడు కత్తి మహేష్‌లతో సహా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నెటిజన్లు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది.
ఈ అంశంపై నిన్న రాత్రి ఏబీఎన్ ఛానెల్‌లో వెంకట కృష్ణ డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జారీ చేసిన నోటీసులోని వ్యక్తుల జాబితా ఇప్పుడే అందిందంటూ వారి పేర్లను వెకంట కృష్ణ చదవడం ప్రారంభించారు. వరుస క్రమంలో నందిగం సురేష్, ఆమంచి కృష్ణ మోహన్ అంటూ మొదలు పెట్టి ఇంటి పేరుతో సహా చదవడం ప్రారంభించారు. 49 పేర్లకు గాను మొదట 43 పేర్లను ఇంటి పేరుతో సహా చదివిన వెంకట కృష్ణ.. 44వ పేరు వద్దకు వచ్చే సరికి కొంత తడబడ్డారు. దీర్ఘం తీశారు. ‘ ఇంకో సం నాట్ సంథింగ్ లోకేష్ సంథింగ్ ఏదో ఉంది’ అంటూ ఆ పేరును ఇంటి పేరుతో సహా చదివేందుకు వెంకట కృష్ణ తీవ్ర ఇబ్బంది పడ్డారు.
ఇంతకీ ఆ పేరు ఏమిటి..? వెంకట కృష్ణ ఎందకు అంత ఇబ్బంది పడ్డారు. వరుస క్రమంలో 43 పేర్లు గడ గడా చదివిన వెంకట కృష్ణ.. 44వ పేరు వద్దకు వచ్చే సరికి ఇంటిపేరు వదిలేసి.. దాని స్థాణంలో ఇంకో సం నాట్ సంథింగ్ లోకేష్ సంథింగ్ ఏతో ఉంది అని ఎందుకన్నారనే దానిపై ఏబీఎన్ ఛానెల్ చూసే వారికి ఉత్కంఠ కలిగింది. ఆ ఇంటి పేరు ఏమిటో తెలుసుకోవాలని హైకోర్టు విడుదల చేసిన 49 పేర్ల జాబితా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు సాధించారు. ఇంతకీ క్రమ సంఖ్య 44లోని పూర్తి పేరు ఏమిటయ్యా..? అంటే… ఎలిమినేటి లోకేష్. ఎలిమినేటి లోకేష్ అని పిలిచేందుకు వెంకట కృష్ణ ఎందుకు అంత ఇబ్బంది పడ్డారో నా లాంటి కొంత మందికి ఏమీ అర్థం కాలేదు..!