Swetha
ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజిలో చాలా మంది బుక్స్ కొనడం , చదవడమే మానేశారు. ఎక్కడో సోషల్ మీడియాలో ఎదో ఒక బుక్ బాగా ఫేమస్ అయితే అప్పుడు ఆన్ లైన్ లో బుక్స్ ఆర్డర్ చేస్తున్నారు. అలా పుస్తకాలకు దూరంగా ఉండే యూత్ ను ఒక వెబ్ సిరీస్ మార్చేసింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే
ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజిలో చాలా మంది బుక్స్ కొనడం , చదవడమే మానేశారు. ఎక్కడో సోషల్ మీడియాలో ఎదో ఒక బుక్ బాగా ఫేమస్ అయితే అప్పుడు ఆన్ లైన్ లో బుక్స్ ఆర్డర్ చేస్తున్నారు. అలా పుస్తకాలకు దూరంగా ఉండే యూత్ ను ఒక వెబ్ సిరీస్ మార్చేసింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే
Swetha
ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజిలో చాలా మంది బుక్స్ కొనడం , చదవడమే మానేశారు. ఎక్కడో సోషల్ మీడియాలో ఎదో ఒక బుక్ బాగా ఫేమస్ అయితే అప్పుడు ఆన్ లైన్ లో బుక్స్ ఆర్డర్ చేస్తున్నారు. అలా పుస్తకాలకు దూరంగా ఉండే యూత్ ను ఒక వెబ్ సిరీస్ మార్చేసింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఈ వెబ్ సిరీస్ పుణ్యమా అని అమెజాన్ వెబ్ సైట్ లో ఓ పుస్తకం టాప్ సెల్లర్ గా మారిపోయింది. అసలు ఆ పుస్తకం ఏంటి.. ఆ వెబ్ సిరీస్ ఏంటి అనే విషయాలు చూసేద్దాం.
రీసెంట్ గా సోనిలివ్ లో “ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్” అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 1991 తమిళనాడు శ్రీ పెరంబదూర్ లో జరిగిన బాంబు దాడిలో మాజీ ప్రధాని ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంబందించిన దోషులను పట్టుకునే ప్రాసెస్ ఏ ది హంట్. ఈ సిరీస్ ను జర్నలిస్ట్ అనిరుద్యా మిత్ర రాసిన ’90 డేస్ ది ట్రూ స్టోరీ అఫ్ ది హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసినేషన్’ ఆధారంగా రూపొందించారు. ఈ సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఈ స్టోరీ మీద మరింత ఆసక్తి కలిగింది. దీనితో నవలలో ఇంకా లోతైన విషయాలు ఉంటాయని భావించి.. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం మొదలు పెట్టారు. అలా నిన్న మొన్నటివరకు ఎవరు పట్టించుకోని ఓ పుస్తకం.. ఒక్కసారిగా వేల కాపీలు అమ్ముడు పోయింది.
నిజంగానే సిరీస్ లో లేని కొన్ని లోతైన అంశాలు.. ఈ పుస్తకంలో క్లియర్ గా పొందుపరిచారట. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో గతంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. జాన్ అబ్రహం – రాశి ఖన్నా ‘మద్రాస్ కేఫ్’లో రాజీవ్ మర్డర్ కు ముందు విషయాలను ఈ సినిమాలో చూపించారు. అలాగే కన్నడ మూవీ ‘సైనేడ్’లో రాజీవ్ గాంధీని చంపిన హంతకులు బెంగళూరు శివారులో దాక్కుంటే వాళ్ళ మీద పోలీసులు జరిపిన ఆపరేషన్ ని చూపించారు. ఇలా ఈ మధ్య కాలంలో ఇలాంటి రియల్ స్టోరీస్ కు బాగానే ఆదరణ పెరుగుతుంది. అలాగే వాటిని బేస్ చేసుకుని బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవడం ఓ రకంగా మంచిదే అని చెప్పొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.