iDreamPost
android-app
ios-app

కాంతారా.. ఇది ఆషామాషి కథ కాదు

  • Published Jul 21, 2025 | 12:12 PM Updated Updated Jul 21, 2025 | 12:12 PM

కాంతార సినిమా గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వింటూనే ఉన్నాము. ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు కొంతమంది యూనిట్ సభ్యులు హఠాన్మరణం చెందారు. దీనితో సినిమా మీద కాస్త నెగిటివిటి వచ్చేసింది. దీనితో సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి

కాంతార సినిమా గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వింటూనే ఉన్నాము. ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు కొంతమంది యూనిట్ సభ్యులు హఠాన్మరణం చెందారు. దీనితో సినిమా మీద కాస్త నెగిటివిటి వచ్చేసింది. దీనితో సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి

  • Published Jul 21, 2025 | 12:12 PMUpdated Jul 21, 2025 | 12:12 PM
కాంతారా.. ఇది ఆషామాషి కథ కాదు

కాంతార సినిమా గురించి ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వింటూనే ఉన్నాము. ఈ సినిమాకు ప్రిక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఇప్పటివరకు కొంతమంది యూనిట్ సభ్యులు హఠాన్మరణం చెందారు. దీనితో సినిమా మీద కాస్త నెగిటివిటి వచ్చేసింది. దీనితో సినిమా ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందేమో అనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు మూవీ టీం వీటి అన్నిటికి చెక్ పెట్టేసారు. తాజాగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ ఫ్యాన్ ఇండియా మూవీ మేకింగ్ వీడియో చూస్తే ఒక్కొక్కరు షాక్ అవ్వాల్సిందే.

ఈ ప్రిక్వెల్ లో కాంతారా మొదటి పార్ట్ కు మించిన గ్రేట్ విజువల్ ట్రీట్స్ ఉండబోతున్నాయని.. వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా పెద్ద కాంపిటీషన్ ఏమి కాదు అనుకునే వారు ఇంకా ఇప్పుడు జాగ్రత్త పడాల్సిందే. పేరుకే ఇది డబ్బింగ్ సినిమా కానీ.. కెజిఎఫ్ రేంజ్ లో హైప్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మొదటి పార్ట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా .. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. సో ఇక ఈ సినిమా దానికి మించి రాబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది.

సో ఈ సినిమా అన్ని భాషలు కలిపి రెండు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగేలా ఉంది. అయితే ఈ సినిమాకు పోటీగా అక్టోబర్ 1న ధనుష్ ఇడ్లి కడాయి మూవీ రానుంది. దానికంటే వారం రోజుల ముందు సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ఓజి.. బాలయ్య అఖండ కూడా రానున్నాయి. ఈ రెండు సినిమాలు సంపాదించుకోబోయే టాక్ ను బట్టి.. కాంతార థియేటర్ ఆక్యుపెన్సీ డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసిన కాంతారా చాప్టర్ 1 మేకింగ్ వీడియో మాత్రం.. ప్రామిసింగ్ కంటెంట్ ను అందిస్తుందని చెప్పొచ్చు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.