iDreamPost
android-app
ios-app

వీరమల్లు బ్యాక్ స్టోరీ ఏంటంటే… !

  • Published Jul 21, 2025 | 4:07 PM Updated Updated Jul 21, 2025 | 4:07 PM

సరిగ్గా ఇంకొక రెండు రోజుల్లో హరి హర వీరమల్లు థియేటర్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జులై 23 అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేయనున్నారు. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే సందడి మొదలెట్టేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడడడంతో అభిమానులలో ఎగ్జైట్మెంట్ అంతకు అంత పెరుగుతుంది.

సరిగ్గా ఇంకొక రెండు రోజుల్లో హరి హర వీరమల్లు థియేటర్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జులై 23 అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేయనున్నారు. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే సందడి మొదలెట్టేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడడడంతో అభిమానులలో ఎగ్జైట్మెంట్ అంతకు అంత పెరుగుతుంది.

  • Published Jul 21, 2025 | 4:07 PMUpdated Jul 21, 2025 | 4:07 PM
వీరమల్లు బ్యాక్ స్టోరీ ఏంటంటే… !

సరిగ్గా ఇంకొక రెండు రోజుల్లో హరి హర వీరమల్లు థియేటర్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జులై 23 అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ వేయనున్నారు. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడే సందడి మొదలెట్టేసారు. రిలీజ్ డేట్ దగ్గర పడడడంతో అభిమానులలో ఎగ్జైట్మెంట్ అంతకు అంత పెరుగుతుంది. పైగా మూవీ టీం ఎప్పటికప్పుడు అప్డేట్స్ , ఇంటర్వూస్ ఇస్తూనే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మొదటిసారి తన సినిమాను ప్రమోట్ చేశారు, దానికోసం స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబందించిన వీడియో బైట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే అసలు వీరమల్లు వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే సందేహాలు కొందరిలో మొదలయ్యాయి. మరి ఆ కథేంటో చూసేద్దాం. కొల్లూరులో ఉండే కోహినూర్ వజ్రం హైదరాబాద్ లోని సుల్తాన్ దగ్గరకు చేరుకుంటుంది. మరోవైపు మొఘలుల దుర్మార్గాలు పెరుగుతూ ఉంటాయి. వారిని అరికట్టడానికి వారి మీద తిరుగుబాటు చేస్తాడు ఓ యోధుడు. అతనే వీరమల్లు. దానికి సంబందించిన కథే ఇది. అయితే ఇలా ఎంత చెప్పుకున్న తక్కువగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి తెరమీద వీరమల్లులా పవన్ కళ్యాణ్ చేసే యుద్ధం చూస్తూనే ఆ శాటిస్ఫ్యాక్షన్ కలుగుతుంది. దీని కోసమే కొన్ని సంవత్సరాలుగా పవన్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

పైగా వీరమల్లు క్లైమాక్స్ కోసం పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన మార్షల్ ఆర్ట్స్ , ఇతర కళలను అన్నిటిని వాడేశారట. సుమారు 20 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఇక నిర్మాత ఏఎం రత్నం కూడా సినిమా మీద తన కాన్ఫిడెన్స్ ను అలానే చూపిస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 , సంక్రాంతికి వస్తున్నాం తర్వాత గట్టిగా వారం పదిరోజులు ఆడిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఇలా టైర్ 1 హీరోలు థియేటర్లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయింది కాబట్టి.. సినిమా మీద గట్టిగ అంచనాలు ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.