Swetha
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్పకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా ఇది. భారీ తారాగణంతో రూపు దిద్దుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్పకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా ఇది. భారీ తారాగణంతో రూపు దిద్దుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.
Swetha
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్పకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కిన డివోషనల్ డ్రామా ఇది. భారీ తారాగణంతో రూపు దిద్దుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిలీజ్ కు ముందే ఓటిటి డీల్స్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాలైతే షూటింగ్ లో ఉన్నప్పుడే డీల్ క్లోజ్ అయిపోతుంది. కానీ కన్నప్ప విషయంలో మాత్రం సినిమా రిలీజ్ వరకు ఓటిటి డీల్ జరగలేదు. దాని వెనుక ఏమి జరిగిందో తెలియనిది కాదు. అయితే ఇప్పుడు మూవీ ఓటిటి డీల్ గురించి టాక్ వినిపిస్తుంది.
జూన్ 27న ఈ సినిమా థియేటర్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యి దాదాపు నాలుగు వారాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి.. జులై 25 నుంచి సినిమాను ఓటిటి లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ డేట్ ను కన్ఫర్మ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ క్యామియోకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. తెలుగు, తమిళం , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ కానుంది. ఇక ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుటునుండో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.