Swetha
ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలలో కాస్త సౌండ్ చేస్తున్న మూవీ జూనియర్. గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి జూనియర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలీల , జెనీలియా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గా నటించారు. కొత్త హీరో అయినా కానీ అనుభవం ఉన్న హీరోలానే నటించి మెప్పించాడు.
ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలలో కాస్త సౌండ్ చేస్తున్న మూవీ జూనియర్. గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి జూనియర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలీల , జెనీలియా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గా నటించారు. కొత్త హీరో అయినా కానీ అనుభవం ఉన్న హీరోలానే నటించి మెప్పించాడు.
Swetha
ఈ శుక్రవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలలో కాస్త సౌండ్ చేస్తున్న మూవీ జూనియర్. గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరీటి జూనియర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలీల , జెనీలియా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గా నటించారు. కొత్త హీరో అయినా కానీ అనుభవం ఉన్న హీరోలానే నటించి మెప్పించాడు. సినిమా చూసిన వారంతా ఇది కిరీటి వన్ మ్యాన్ షో అని.. డ్యాన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను గుర్తుచేసాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యికి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఓ డెబ్యూ హీరో సినిమాను ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం చెప్పుకోదగిన విషయమే. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది డౌట్.
ఎందుకంటే మొదటి రోజు అయితే సినిమా పరవాలేదు అనిపించుకుంది. కాబట్టి వీకెండ్స్ ఓపెనింగ్స్ బానే ఉంటాయి. కానీ మండే నుంచి ఓపెనింగ్స్ తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. గతంలో కాస్త హిట్ టాక్ సంపాదించుకున్న సినిమాలకే మండే నుంచి ఓపెనింగ్స్ తగ్గుముఖం పట్టాయి. సో జూనియర్ ఎంత వరకు నెగ్గుకురాగలుగుతాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ తీసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించిన మాట నిజమే. సెకండ్ ఆఫ్ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. అయినా కిరీటి ఆల్మోస్ట్ దానిని కవర్ చేసుకుని వచ్చాడు. ముఖ్యంగా సినిమాలో వైరల్ వయ్యారి సాంగ్ తెగ వైరల్ అయింది. అతని డ్యాన్స్ కు అంతా ఫిదా అయ్యారు.
సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే వాటి అన్నీటిసంగతి పక్కన పెడితే కిరీటికి హీరోగా ఎదగడానికి జూనియర్ ఓ ప్రూఫ్ లా చెప్పొచ్చు. ఈ సినిమాలో తన టాలెంట్ మొత్తాన్ని కనబరిచాడు. ఇలాంటి ఎనేర్జి , డ్యాన్స్ చేసే యంగ్ హీరోస్ ఉంటె చాలు వాళ్ళ మీద ఖర్చు పెట్టె నిర్మాతలు చాలా మందే ఉన్నారు. సో జూనియర్ ఏమి సాదించాలి అనుకున్న ఈ మూడు రోజుల్లో రాబట్టాల్సిందే. ఏ మేరకు ఈ హీరో తన టార్గెట్ ను రీచ్ అవుతాడో చూడాలి. దీనిని బట్టి ముందు ముందు ఈ హీరోకు ఛాన్స్ లు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.