iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లవర్స్ కు పండగే…

  • Published Jul 19, 2025 | 12:04 PM Updated Updated Jul 19, 2025 | 12:04 PM

ఈ వారం బాక్స్ ఆఫీస్ బాగానే ఉంటుందిలే అని అనుకుంటూ వారం వారం గడిచిపోతుంది. కానీ చెప్పుకోడానికి ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా థియేటర్ స్క్రీన్ మీద పడడం లేదు. తెలుగు రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది

ఈ వారం బాక్స్ ఆఫీస్ బాగానే ఉంటుందిలే అని అనుకుంటూ వారం వారం గడిచిపోతుంది. కానీ చెప్పుకోడానికి ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా థియేటర్ స్క్రీన్ మీద పడడం లేదు. తెలుగు రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది

  • Published Jul 19, 2025 | 12:04 PMUpdated Jul 19, 2025 | 12:04 PM
ఈ వారం OTT లవర్స్ కు పండగే…

ఈ వారం బాక్స్ ఆఫీస్ బాగానే ఉంటుందిలే అని అనుకుంటూ వారం వారం గడిచిపోతుంది. కానీ చెప్పుకోడానికి ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా థియేటర్ స్క్రీన్ మీద పడడం లేదు. తెలుగు రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తెలుగు విషయానికొస్తే ఈ వారం యంగ్ హీరో కిరీటి డెబ్యూ ఫిల్మ్ జూనియర్ సినిమా రిలీజ్ అయింది. ఆన్ అండ్ యావరేజ్ సినిమాకు బాగానే రెస్పాన్స్ వస్తుంది. ఇక దీనితో పాటు కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా కూడా రిలీజ్ అయింది. కానీ అది పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. సో ప్రేక్షకులను ప్రస్తుతం థియేటర్స్ కు రప్పించడం పెద్ద టాక్స్ గా మారిపోయింది. సో ఈ వీకెండ్ ప్రేక్షకులను అలరించడానికి ఓటిటి లో క్రేజి కంటెంట్ రిలీజ్ అయింది.

అందులో అందరు ఎదురు చూసేది.. శేఖర్ కమ్ముల తీసిన కుభేర సినిమా. సమ్మర్ లో థియేటర్స్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయంటే దానికి కారణం ఈ సినిమానే. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయితే కనుక వెంటనే ఓటిటి లో చూసేయండి. ఈ సినిమా తమిళం , హిందీ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీనితో పాటు ముగ్గురు హీరోల కంబ్యాక్ మూవీ భైరవం.. జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను చూసేయండి.

అలాగే హిందీలో సంజయ్ దత్ ‘భూత్ని’ కూడా జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే హౌస్ ఫుల్ 5 అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా రెంటల్ విధానంలో ఉంది. కొద్దీ రోజుల్లో నార్మల్ గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇవన్నీ కాకుండా అన్ని జోనర్స్ , అన్ని బాషల ప్రేక్షకులను అలరించడానికి ఓ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అదే స్పెషల్ ఆప్స్ 2. హాట్స్టార్ లో గతంలో రిలీజ్ అయినా స్పెషల్ ఆఫ్ సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ కొత్త సీజన్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇవి కాకుండా ఇంకా చాలానే సినిమాలు , సిరీస్ లు ఓటిటి రిలీజ్ అయ్యాయి. కాబట్టి అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.