iDreamPost
android-app
ios-app

మిరాయ్ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట ..

  • Published Jul 23, 2025 | 1:59 PM Updated Updated Jul 23, 2025 | 1:59 PM

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చెప్పిన టైం కు అసలు రిలీజ్ కావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోతుంది. సడెన్ గా రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉంది అనగా సినిమా పోస్ట్ పోన్ అనే మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5 న తేజ సజ్జా మిరాయ్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చెప్పిన టైం కు అసలు రిలీజ్ కావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోతుంది. సడెన్ గా రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉంది అనగా సినిమా పోస్ట్ పోన్ అనే మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5 న తేజ సజ్జా మిరాయ్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

  • Published Jul 23, 2025 | 1:59 PMUpdated Jul 23, 2025 | 1:59 PM
మిరాయ్ రిలీజ్ లో  ఎలాంటి మార్పు లేదట ..

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చెప్పిన టైం కు అసలు రిలీజ్ కావడం లేదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోతుంది. సడెన్ గా రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉంది అనగా సినిమా పోస్ట్ పోన్ అనే మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5 న తేజ సజ్జా మిరాయ్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత వారం రోజుల నుంచి మిరాయ్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనితో ఆ ప్లేస్ లో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ , అనుష్క ఘాటీ సినిమాలు రిలీజ్ అవుతాయి అనే మాట స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం మిరాయ్ లో ఎలాంటి ఛేంజ్ లేదని చెప్తుంది.

మరో మూడు రోజుల్లో ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ అనౌన్సుమెంట్ చేయనున్నట్లు.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ స్పష్టంగా సెప్టెంబర్ 5 ని ఉంది. అయితే సినిమా పోస్ట్ పోన్ అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయానికొస్తే.. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా లేట్ గా సాగుతున్నాయట. VFX క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో ఫైనల్ కాపీ రెడీ అవ్వడానికి టైం పడుతుందని.. అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ వచ్చింది.

గతంలో ఈ సినిమాను ఏప్రిల్ 18 న ఓసారి ఆగష్టు 1 న ఓసారి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన అవి పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి సినిమా పోస్ట్ పోన్ అంటే సినిమా మీద ఉండే బజ్ పోతుంది. అందుకే ఈసారి ఎలా అయినా సరే సినిమాను అనుకున్న టైం కు రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట మేకర్స్. సో సినిమా రిమైనింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.