iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో ఒకే ఒక్క తెలుగు మూవీ.. ఎక్కడంటే?

  • Published Jul 22, 2025 | 12:14 PM Updated Updated Jul 22, 2025 | 12:14 PM

ఈ వారం ఎలాగూ థియేటర్ లో హరి హర వీరమల్లు ఎంట్రీ ఇస్తుంది. దాదాపు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నా సినిమా.. టాలీవుడ్ లో చాలా నెలల తర్వాత వస్తున్న భారీ మూవీ. సో దాదాపు ప్రేక్షకులంత థియేటర్స్ దగ్గరే క్యూ కడతారు.

ఈ వారం ఎలాగూ థియేటర్ లో హరి హర వీరమల్లు ఎంట్రీ ఇస్తుంది. దాదాపు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నా సినిమా.. టాలీవుడ్ లో చాలా నెలల తర్వాత వస్తున్న భారీ మూవీ. సో దాదాపు ప్రేక్షకులంత థియేటర్స్ దగ్గరే క్యూ కడతారు.

  • Published Jul 22, 2025 | 12:14 PMUpdated Jul 22, 2025 | 12:14 PM
ఈ వారం OTTలో ఒకే ఒక్క తెలుగు మూవీ.. ఎక్కడంటే?

ఈ వారం ఎలాగూ థియేటర్ లో హరి హర వీరమల్లు ఎంట్రీ ఇస్తుంది. దాదాపు ప్రేక్షకులంతా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా చాలా ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నా సినిమా.. టాలీవుడ్ లో చాలా నెలల తర్వాత వస్తున్న భారీ మూవీ. సో దాదాపు ప్రేక్షకులంత థియేటర్స్ దగ్గరే క్యూ కడతారు. అయితే ఓటిటి మూవీస్ కు కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండనే ఉంటారు కదా.. వారి కోసమే ఈ వారం ఓటిటి లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. మరి ఆ సినిమా ఎదో చూసేద్దాం.

ఈ సినిమా పేరు షో టైం.. ఈ సినిమా జూలై 4 న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో థియేటర్ లో రిలీజ్ అయినా 21 రోజులకే ఈ సినిమాను ఓటిటి స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చేస్తున్నారు. జులై 25 నుంచి ఈ ఈసినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది. పైగా ఒకేసారి రెండు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సన్ నెక్స్ట్ , అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర లీడ్ రోల్ ప్లే చేశాడు. అతనితో పాటు రాజా రవీంద్ర , కామాక్షి భాస్కర్ల , నరేష్ లాంటివారు నటించారు.

నవీన్ చంద్ర సినిమాలు ఎలా ఉంటాయో తెలియనిది కాదు. ఈ సినిమా అంతా సూర్య , శాంతి , లక్ష్మీకాంత్ అనే ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. ఓ హత్య వీళ్ళ జీవితాలను ఎలా మాచేస్తుంది అనేదే సినిమా కథ. సూర్య , లక్ష్మీకాంత్ మధ్య ఇగో సమస్యలు ఆ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఆ తర్వాత ఏమి జరిగింది ? అసలు ఈ క్రైం నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ? ఆ హత్య ఎవరు చేశారు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సో ఈ వీకెండ్ లో వచ్చే ఈ తెలుగు సినిమాను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.