Swetha
సరిగ్గా ఇంకో 20 రోజుల్లో కూలి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరగడమే కానీ తగ్గేలా కనిపించడం లేదు. టీజర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే.. ఒకే ఒక్క గ్లిమ్ప్స్ తో ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయడం కేవలం లోకేష్ కనగరాజ్ కు మాత్రమే సొంతం.
సరిగ్గా ఇంకో 20 రోజుల్లో కూలి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరగడమే కానీ తగ్గేలా కనిపించడం లేదు. టీజర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే.. ఒకే ఒక్క గ్లిమ్ప్స్ తో ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయడం కేవలం లోకేష్ కనగరాజ్ కు మాత్రమే సొంతం.
Swetha
సరిగ్గా ఇంకో 20 రోజుల్లో కూలి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు పెరగడమే కానీ తగ్గేలా కనిపించడం లేదు. టీజర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే.. ఒకే ఒక్క గ్లిమ్ప్స్ తో ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేయడం కేవలం లోకేష్ కనగరాజ్ కు మాత్రమే సొంతం. ఇక్కడ అనిరుధ్ పాత్రను తక్కువ అంచనా వేయడానికి లేదు. పాటలతో సినిమా మీద క్రేజ్ ను పెంచేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ కు సంబంధించి.. పెద్దగా విషయాలేమి బయటకు రాలేదు. సో ట్రైలర్ తో కూలి మేకర్స్ చాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే తాజాగా చెన్నై టాక్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా మారింది అదేంటంటే
కూలీలో కాస్త జైలర్ ఫ్లేవర్ ఉండబోతుందంట . సినిమా విజువల్స్ ఎఫెక్ట్స్ అన్ని గ్రాండియర్ గా ఉండొచ్చేమో కానీ.. లైన్ పరంగా మాత్రం లోకేష్ అంత కొత్తగా రాయలేదని ఇన్సైడ్ టాక్. స్టోరీ లైన్ విషయానికొస్తే ఒకప్పుడు హార్బర్ ను తన చూపు చేతల్లో ఉంచుకుని గోల్డ్ స్మగ్లింగ్ చేసిన ఓ డాన్.. అతను రిటైర్ అయ్యాక అతని గతం వెంటాడుతోందట. ఈ క్రమంలో అతను ఓ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి.. తన గ్యాంగ్ పరిచయాలు గురించి బయటకి తీస్తారు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. రజినీకాంత్ , నాగార్జున మధ్య జరిగే వార్ లో ఎవరు నెగ్గారు.. ఎవరి పాత్ర ఎలాంటిది అనే ప్రశ్నల చుట్టూ లోకేష్ కూలి స్క్రీన్ ప్లే ను రాసుకున్నాడట.
జైలర్ లో తన వాళ్ళ కోసం శివరాజ్ కుమార్ మోహన్ లాల్ సాయంఎలా అయితే తీసుకున్నాడో. కూలిలో కూడా ఇంచుమించు ఇదే తరహా ట్రీట్మెంట్ ఉంటుందట. కాకపోతే ఇక్కడ లోకేష్ కనగరాజ్ మార్క్ అసలు మిస్ అవ్వడాన్ని అంతా బలంగా నమ్ముతున్నారు. లాస్ట్ టెన్ మినిట్స్ అమీర్ ఖాన్ క్యామియో ఉండే ఎపిసోడ్ పీక్స్ లో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.