Swetha
ప్రస్తుతం ఓటిటిలో సినిమాలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో తెలియనిది కాదు. థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఓటిటి లోకి రాగానే. ఒక్క రోజులోనే ట్రెండింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో ఓ థ్రిల్లర్ మూవీ , ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అదరగొట్టేస్తున్నాయి

ప్రస్తుతం ఓటిటిలో సినిమాలు ఎలా ట్రెండ్ అవుతున్నాయో తెలియనిది కాదు. థియేటర్ లో హిట్ అవ్వని సినిమాలు కూడా ఓటిటి లోకి రాగానే. ఒక్క రోజులోనే ట్రెండింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో ఓ థ్రిల్లర్ మూవీ , ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అదరగొట్టేస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలు చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాలేంటో ఆ కథలేంటో చూసేద్దాం.
DNA అనే సినిమా తమిళంలో థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో జులై 18 న తెలుగులో మై బేబీ పేరుతో రిలీజ్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ముందుగానే ఫిక్స్ ఓటిటి డీల్ ప్రకారం జూలై 19నుంచి DNA జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. పుట్టగానే మారిపోయిన తమ బిడ్డ కోసం కోసం వెతికే తల్లిదండ్రుల కథే DNA . సినిమా మొదటినుంచి చివరి వరకు ఉత్కంఠతో కొనసాగుతూ ఉంటుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ , ట్విస్ట్ లు ఇలా అన్నీ సినిమాలు ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.
ఇక ఆ సినిమా కాకుండా స్పెషల్ ఆప్స్ అనే వెబ్ సిరీస్ ఓటిటి లో దూసుకుపోతుంది. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో.. వెంటనే రెండో సీజన్ ను అనౌన్స్ చేశారు. సీజన్ 2 కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సీజన్ 2 లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి. సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచి సీట్ ఎడ్జె లో కూర్చోపెడుతుంది. తెలుగు , తమిళం , కన్నడ , హిందీ , మరాఠి భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకుండా ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.