iDreamPost
android-app
ios-app

బాహుబలి పార్ట్ 3 కోసమేనా ఇదంతా !

  • Published Jul 19, 2025 | 1:03 PM Updated Updated Jul 19, 2025 | 1:03 PM

ఇండియన్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ బాహుబలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి దశాబ్దం అయింది. అయినా సరే సినిమా గురించి అంతా ఇంకా చాలా గర్వాంగా చెప్పుకుంటూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటో తెలియనిది కాదు. అయితే ఈ సందర్బంగా రాజమౌళి బాహుబలి రెండు పార్ట్శ్ ను కలిపి బాహుబలి : ది ఎపిక్ గా రీలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇండియన్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ బాహుబలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి దశాబ్దం అయింది. అయినా సరే సినిమా గురించి అంతా ఇంకా చాలా గర్వాంగా చెప్పుకుంటూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటో తెలియనిది కాదు. అయితే ఈ సందర్బంగా రాజమౌళి బాహుబలి రెండు పార్ట్శ్ ను కలిపి బాహుబలి : ది ఎపిక్ గా రీలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

  • Published Jul 19, 2025 | 1:03 PMUpdated Jul 19, 2025 | 1:03 PM
బాహుబలి పార్ట్ 3 కోసమేనా ఇదంతా !

ఇండియన్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ బాహుబలి. ఈ సినిమా రిలీజ్ అయ్యి దశాబ్దం అయింది. అయినా సరే సినిమా గురించి అంతా ఇంకా చాలా గర్వాంగా చెప్పుకుంటూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటో తెలియనిది కాదు. అయితే ఈ సందర్బంగా రాజమౌళి బాహుబలి రెండు పార్ట్శ్ ను కలిపి బాహుబలి : ది ఎపిక్ గా రీలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఎడిటింగ్ వర్క్స్ కూడా మొదలైపోయాయి. SSMB 29 లో బ్రేక్ దొరికినప్పుడల్లా రాజమౌళి ఈ ఎడిటింగ్ వర్క్స్ ను చూసుకుంటున్నాడట. రీసెంట్ గా ఈ సినిమా రీ మాస్టర్డ్ వెర్షన్ రన్ టైం విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపించాయి.

అంతే కాకుండా సోషల్ మీడియాలో ఇంకో ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతుంది. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయ్యాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో.. బాగా చర్చనీయాంశం అయింది.దానికి ఆన్సర్ పార్ట్ 2 రిలీజ్ అయ్యాక దొరికేసింది. ఇక ఇప్పుడు రీమాస్టర్డ్ వెర్షన్ రిలీజ్ కు ముందు మరో ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. “కట్టప్ప బాహుబలిని చంపకపోతే ?”.. గత రెండు మూడు రోజులుగా ఈ ప్రశ్న పై చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ , రానా కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి. అయితే ఇది కేవలం రీరిలీజ్ కోసం మాత్రమే కాదని బాహుబలి పార్ట్ 3 కోసం కూడా అయ్యి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి పార్ట్ 3 ప్లాన్స్ ను కొట్టి పడేయలేమని గతంలో ఓసారి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజమౌళి కూడా ఓ సందర్భంలో పార్ట్ 3 వస్తే బావుంటుందని అన్నారు. అయితే ఆ టీం నుంచి ఎవరు ఏమి లీక్ చేయరు.. సో అసలు ఉందా లేదా అనే క్లారిటీ రావాలంటే ఇంకాస్త టైం పడుతుంది. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పటిలో అయితే ఉండదని మాత్రం అందరికి అర్ధమౌతుంది. సో అప్పటివరకు అక్టోబర్ లో రీరిలీజ్ అయ్యే బాహుబలి ది ఎపిక్ కోసం ఎదురుచూడాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.