iDreamPost
android-app
ios-app

అవతార్ 3 ట్రైలర్ ఎప్పుడంటే.. !

  • Published Jul 22, 2025 | 4:47 PM Updated Updated Jul 22, 2025 | 4:47 PM

అవతార్ సినిమా ఈ పేరు వరల్డ్ మూవీ హిస్టరీలో ఎప్పటికి బ్లాక్ బస్టర్ గానే నిలిచిపోతుంది. 2009 లో అవతార సినిమా రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ మూవీ సంచలనం సృష్టించింది. అప్పటివరకు మూవీ హిస్టరీలో ఉండే రికార్డ్స్ అన్నిటిని తుడిచిపెట్టేసింది.

అవతార్ సినిమా ఈ పేరు వరల్డ్ మూవీ హిస్టరీలో ఎప్పటికి బ్లాక్ బస్టర్ గానే నిలిచిపోతుంది. 2009 లో అవతార సినిమా రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ మూవీ సంచలనం సృష్టించింది. అప్పటివరకు మూవీ హిస్టరీలో ఉండే రికార్డ్స్ అన్నిటిని తుడిచిపెట్టేసింది.

  • Published Jul 22, 2025 | 4:47 PMUpdated Jul 22, 2025 | 4:47 PM
అవతార్ 3 ట్రైలర్ ఎప్పుడంటే.. !

అవతార్ సినిమా ఈ పేరు వరల్డ్ మూవీ హిస్టరీలో ఎప్పటికి బ్లాక్ బస్టర్ గానే నిలిచిపోతుంది. 2009 లో అవతార సినిమా రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ మూవీ సంచలనం సృష్టించింది. అప్పటివరకు మూవీ హిస్టరీలో ఉండే రికార్డ్స్ అన్నిటిని తుడిచిపెట్టేసింది. ఓ సినిమా ఇంతమందిని థియేటర్స్ కు రప్పించే సత్తా ఉందని అవతార్ ప్రూవ్ చేసింది ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరూన్.. మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడంతో వరుసగా నాలుగు సిక్వెల్స్ ను అనౌన్స్ చేశాడు. అయితే ఆ తర్వాత 2022 లో వచ్చిన అవతార్ సిక్వెల్ ‘ది వే ఆఫ్ వాటర్’ మూవీ మాత్రం.. మొదటి పార్ట్ అంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది.

వసూళ్లకు ఇబ్బంది ఏమి రాలేదు కానీ.. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఆ తరవాత అవతార్ 3 ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా చాలా గొప్పగా ఉండబోతుందని అందరిని ఊరిస్తూ వస్తున్నాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ మూడవ పార్ట్ ట్రైలర్ ను ఐదు నెలల ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు దర్శకుడు. ఈ నెలలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారట.

జూలై 25న ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు అవతార్-3’ ట్రైలర్‌ను ఎటాచ్ చేయనున్నారు. ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ లోను అవతార్ 3 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ అయితే కానీ తెలీదు.. అవతార్ 3.. అవతార్ 2 ని మించి ఉంటుందా లేదా అనేది. ప్రస్తుతానికైతే సినిమా మీద బజ్ , హైప్ బాగానే ఉన్నాయి. ట్రైలర్ తర్వాత రెస్పాన్స్ ఎలా వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.