విరాటపర్వం స్టోరీ అదేనా?? హీరో రానా కాదా??

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా, ప్రియమణి ముఖ్యపాత్రలో వస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనాకు ముందే మొదలు పెట్టిన ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక కథ బలంగా వినిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వేణు ఇది నిజంగా జరిగిన కథ అని దానికి సంబంధించిన కథ చెప్పాడు.

దీంతో నల్గొండ జిల్లాలోని ఓ నక్సలైట్ కథే ఈ సినిమా అని తెలుస్తుంది. రవన్న అనే నక్సలైట్ జనాలని తన మాటలతో ప్రభావితం చేస్తూ ఉంటాడు. సరళ అనే అమ్మాయి రవన్న ప్రసంగాలకు, ఆయన భావాలకు ఆకర్షితురాలై ఆయన్ని వన్‌సైడ్‌గా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆయన్ని కలిసేందుకు, నక్సల్స్ లో చేరేందుకు తరచూ అడవిలోకి వెళ్లేదట. రవన్న కోసం ఆమె అడవిలోకి రెగ్యూలర్‌గా వచ్చేదని, దీంతో ఆమెని పోలీస్‌కి చెందిన ఇన్‌ఫార్మర్‌గా నక్సల్స్ అనుమానించేవారు. అలాగే ఈమె ప్రతి సారి నక్సల్స్ ని కలిసి వస్తుందని తెలిసి పోలీసులు కూడా ఆమెని నక్సల్స్ ఇన్‌ఫార్మర్‌గా అనుమానిస్తారట. చివరికి ఆమెపై అనుమానం ఎక్కువైన నక్సల్సే సరళని చంపేస్తారని, భరతక్క అనే నక్సలైట్ సరళని హత్య చేశారని రియల్‌ లైఫ్‌లో జరిగిన సంఘటన ఆధారంగా తెలుస్తుంది.

దీంతో ఈ సినిమా కథ ఇదే అని, రవన్న పాత్రలో రానా నటిస్తుండగా, సరళ అనే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి, భరతక్క పాత్రలో ప్రియమణి నటిస్తుందని సమాచారం. మరి ఈ కథ ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో రానా కంటే ఎక్కువగా సాయి పల్లవి చుట్టే కథ తిరుగుతుందని, సాయి పల్లవి మెయిన్ లీడ్ అని రానానే స్వయంగా చెప్పడం, డైరెక్టర్ కూడా సాయి పల్లవి పాత్ర గురించి గట్టిగానే చెప్పడంతో ఈ సినిమా హీరో రానా కాదు సాయి పల్లవి అని అంతా అంటున్నారు. సాయి పల్లవి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Show comments