iDreamPost
android-app
ios-app

తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయ్.. సాయి పల్లవి గెలిచింది!

  • Published Nov 07, 2024 | 1:02 PM Updated Updated Nov 07, 2024 | 1:02 PM

Sai Pallavi : సాయి పల్లవి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. ఎప్పుడు లేనిది ఈ అమ్మడు రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుంది. అయినా సరే ఇప్పుడు ఈ అమ్మడి మీద ఏ మాత్రం అది ఎఫెక్ట్ చూపించలేదు. ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం.

Sai Pallavi : సాయి పల్లవి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. ఎప్పుడు లేనిది ఈ అమ్మడు రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకుంది. అయినా సరే ఇప్పుడు ఈ అమ్మడి మీద ఏ మాత్రం అది ఎఫెక్ట్ చూపించలేదు. ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 07, 2024 | 1:02 PMUpdated Nov 07, 2024 | 1:02 PM
తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయ్.. సాయి పల్లవి గెలిచింది!

ఒకప్పుడు కేవలం హీరోల కోసం జనం థియేటర్స్ కు క్యూ కట్టేవారు. చాలా కాలం వరకు ఈ ఫార్ములా వర్క్ అవుట్ అయింది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ నే ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్ . కథ నచ్చితేనే థియేటర్స్ కు కదులుతున్నారు. ఈ ఏడాది అలాంటి అద్భుతాలు ఎన్నో చూశాం. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్ లో సాయి పల్లవి క్రౌడ్ పుల్లర్ గా మారింది. ఈ హీరోయిన్ కోసమైనా మరోసారి సినిమా చూడాలనే టాక్ నడుస్తుంది. అంతలా ఆమె ప్రేక్షకుల మదిలో స్థానం ఏర్పరుచుకుంది. ప్రస్తుతం అమరన్ మూవీకి వస్తున్న టాక్ వెనుక.. సాయి పల్లవి మ్యానియా ఉందని స్పష్టంగా అందరికి అర్ధమౌతుంది. మొన్నటివరకు బాయ్ కాట్ సాయి పల్లవి అంటూ వైరల్ చేసిన అదే సోషల్ మీడియా.. ఈరోజు ఆమెను పొగడ్తలతో ముంచేస్తుంది.

అమరన్ స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోయినా సరే.. తెలుగు స్టేట్స్ లో ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుంది. ఇక తమిళ నాట ఈ సినిమా చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో శివ కార్తికేయన్ స్టార్ హీరోనే.. కానీ అక్కడ కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే మొదటి సారి. అక్కడ ఈ సినిమాకు సాయి పల్లవి గ్లామర్ బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇక తెలుగులో అయితే ఇది అమరన్ సినిమా కంటే కూడా.. సాయి పల్లవి సినిమాగానే చలామణి అవుతుంది. సాధారణంగా ఏ సెలెబ్రిటీ అయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైతే.. కచ్చితంగా వారి నెక్స్ట్ మూవీస్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. కానీ సాయి పల్లవిపై వచ్చిన ట్రోలింగ్స్ ఎఫెక్ట్ అమరన్ మూవీ మీద ఇసుమంతైన చూపించలేకపోయాయి. ఇక్కడే సాయి పల్లవి గెలిచింది. ఆమె ఫాలో అయ్యే సిద్ధాంతాలే ఆమెను గెలిపించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో అంత జరుగుతున్నా కానీ అసలేమీ స్పందించలేదు. తన పని తానూ చేసుకుంటూ వెళ్ళింది. ఈరోజు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అంతా సాయి పల్లవి మ్యానియానే నడుస్తుందని చెప్పి తీరాల్సిందే.

ఇక తర్వాత ఈ అమ్మడి నుంచి వస్తున్న మూవీ తండేల్. ఇప్పుడు సాయి పల్లవి గురించి వినిపిస్తున్న టాక్ కారణంగా.. తండేల్ టీం ఈ సినిమాపై గట్టి నమ్మకాలు పెట్టుకుంది. ఆ మూవీ స్థాయిని , వసూళ్లను పెంచే సత్తా సాయి పల్లవికి ఉందని మూవీ టీం బలంగా నమ్ముతుంది. తండేల్ సినిమాలో అత్యంత కీలకమైన సెకండ్ ఆఫ్ సాయి పల్లవి తన భుజాలపై నడిపించిందని సమాచారం. మొత్తానికి అమరన్ తర్వాత ఈ అమ్మడి క్రేజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాల్సిందే. ఇక రానున్న రోజుల్లో సాయి పల్లవి ఎలాంటి కథలతో ముందుకు వస్తుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet