iDreamPost
android-app
ios-app

ఇట్స్ అఫీషియల్.. మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ రిలీజ్ డేట్ లాక్..

Thandel Release Date: ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా తండేల్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తండేల్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

Thandel Release Date: ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా తండేల్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తండేల్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

ఇట్స్ అఫీషియల్.. మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ రిలీజ్ డేట్ లాక్..

అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ తండేల్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే తండేల్ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు తండేల్ రిలీజ్ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ తండేల్ నుంచి క్రేజీ అప్ డేట్ అందించారు. మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. తండేల్ మూవీ వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 7 2025న రిలీజ్ కానున్నది.

దుళ్లకొట్టేయడానికి తండేల్ వస్తున్నాడంటూ విడుదల తేదీ అనౌన్స్ చేశారు. వాలంటైన్స్ డే కు ముందు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నది. తండేల్ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీల్లోనూ రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఎక్స్ లో పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక తండేల్ నుంచి ఫస్ట్ సింగిల్ శివ-పార్వతులకు సంగీత విందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ కు సంబంధించిన నాగ చైతన్య, సాయి పల్లవిల ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల అమరన్ మూవీతో అలరించిన సాయిపల్లవి మరోసారి తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక చై త్వరలో శోభిత ధూళిపాళతో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వీరి పెళ్లి డిసెంబర్ 04న జరగనున్నట్లు తెలుస్తోంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet