iDreamPost
android-app
ios-app

వీడియో వైరల్: ఘనంగా సాయిపల్లవి చెల్లి పెళ్లి

  • Published Sep 05, 2024 | 6:02 PM Updated Updated Sep 05, 2024 | 6:41 PM

Sai Pallavi Sister Wedding Video: తాజాగా సాయి పల్లవి చెల్లి  పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల క్రితమే తాను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం చేసుకున్న పూజా కన్నన్.. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Sai Pallavi Sister Wedding Video: తాజాగా సాయి పల్లవి చెల్లి  పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల క్రితమే తాను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం చేసుకున్న పూజా కన్నన్.. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

  • Published Sep 05, 2024 | 6:02 PMUpdated Sep 05, 2024 | 6:41 PM
వీడియో వైరల్: ఘనంగా సాయిపల్లవి చెల్లి పెళ్లి

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే..ఇప్పుడు సాయి పల్లవి టాలీవుడ్, కోలీవుడ్, మాలివుడ్  కు మాత్రమే సుపరిచితం కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అక్కడ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో  సీతగా నటిస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సాయి పల్లవికి పూజా కన్నన్ అనే  సోదరి ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈమె కూడా అక్క బాటలో హీరోయిన్ అవుదని సెవ్వనం అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ, తన అక్కలా క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోవడంతో.. పూర్తిగా వెండితెరకు దూరమైంది. ఇకపోతే గత కొన్ని నెలల క్రితం పూజ కన్నన్ తన చిరకాల మిత్రుడు వినీత్ తో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా ఈ చిన్నది ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విశేషలేంటో చూద్దాం.

తాజాగా సాయి పల్లవి చెల్లి  పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల క్రితమే తాను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం చేసుకున్న పూజా కన్నన్.. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ పెళ్లిలో రెండు కుటుంబాలు, సన్నిహితులు, బంధువుల మధ్య సాయి పల్లవి చెల్లెలు పూజా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి వివాహం ఈరోజు (గురువారం 5-9-2024)  ఉదయం  జరిగినట్లు తెలుస్తోంది.  ఇక చెల్లెలి పెళ్లిలో సాయి పల్లవి  మరోసారి తన డాన్స్ తో అదరగొట్టేసింది. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, ఆ వీడియోలో సాయిపల్లవి.. పట్టుచీరతో ఎంతో అందంగా మెరిసింది. అయితే వివాహ వేడుక అనంతరం సాయిపల్లవి తన చెల్లితో కలిసి డాన్స్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ మరోసారి సాయిపల్లవి డ్యాన్స్ కు పిధా అయ్యారు. చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. కొత్తగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంటకు నెట్టింట శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి, నాగ చైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది. ఇక ఈ సినిమాను  డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. మరీ,  చెల్లి పెళ్లిలో మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş