iDreamPost
android-app
ios-app

సాయి పల్లవిని నార్త్ వద్దంటుంటే.. మేమున్నాం రమ్మంటుంది సౌత్

  • Published Nov 02, 2024 | 3:55 PM Updated Updated Nov 02, 2024 | 3:55 PM

Sai Pallavi: సాయి పల్లవి.. ఈ అమ్మడికి ప్రేమమ్ మూవీ తర్వాత పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడు లేనిది ఈ మధ్య సాయి పల్లవి ఓ వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ అంటూ ట్రెండ్ అయింది. అయితే ఇప్పుడు అమరన్ తర్వాత నార్త్ వద్దంటుంటే.. సౌత్ రమ్మంటుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Sai Pallavi: సాయి పల్లవి.. ఈ అమ్మడికి ప్రేమమ్ మూవీ తర్వాత పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడు లేనిది ఈ మధ్య సాయి పల్లవి ఓ వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ అంటూ ట్రెండ్ అయింది. అయితే ఇప్పుడు అమరన్ తర్వాత నార్త్ వద్దంటుంటే.. సౌత్ రమ్మంటుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 02, 2024 | 3:55 PMUpdated Nov 02, 2024 | 3:55 PM
సాయి పల్లవిని నార్త్ వద్దంటుంటే.. మేమున్నాం రమ్మంటుంది సౌత్

ఎప్పడు లేనిది ఈ మధ్య సాయి పల్లవి ఓ వివాదంలో చిక్కుకుంది. #బాయ్ కాట్ సాయి పల్లవి టాగ్ తో ట్రెండ్ అయింది. ఏకంగా బాలీవుడ్ లో ఆమె చేస్తున్న రామాయణం నుంచి కూడా తొలగించాలనే వార్తలు వచ్చాయి. కానీ ఈ రౌడీ బేబీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మనం మాట్లాడం కాదు మన వర్క్ మాట్లాడాలి అంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా అమరన్ మూవీతో మరోసారి తన సత్తా ఏంటో చూపించింది. దీనితో ఎవరు కావాలనుకున్నా వద్దనుకున్నా.. మేము మాత్రం వదులుకోము. మా ఇంటి బంగారం గురించి మాకు తెలియదా అంటూ సౌత్ సినిమా సాయి పల్లవిని సపోర్ట్ చేస్తుంది. అయితే అమరన్ మూవీ తమిళంలో భారీ వసూళ్లను సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ అయినా ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చెప్పుకోదగిన విషయం.

ఆ సినిమా నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కేవలం మూడు రోజులలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందనే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు కాంపిటీషన్ లో ఇంకా రెండు సినిమాలు ఉన్నప్పటికీ.. కొన్ని సెంటర్స్ లో డామినేషన్ చూపించే రేంజ్ లో అమరన్ అదరగొడుతుంది. ఆల్రెడీ ఇలాంటి బ్యాక్డ్రాప్ తో ఓ సినిమా వచ్చింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ రోల్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ అమరన్ లో మాత్రం.. సాయి పల్లవి క్యారెక్టర్ లో ఒదిగిపోయిన తీరు.. హీరోనే డామినేట్ చేసిందని చెప్పాల్సిందే. కట్టిపడేసే ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో అందరికి కన్నీళ్లు తెప్పించేస్తుంది ఆ పాత్ర. థియేటర్ నుంచి బయటకు వచ్చాకా కూడా వెంటపడే రీతిలో.. సాయి పల్లవి అందరి హృదయాలను కదిలించేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే బజ్ నడుస్తుంది.

తెలుగులో సాయి పల్లవి తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా.. ఈ అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అంతే కాదు సాయి పల్లవి గురించి ఎప్పుడు ఎక్కడ విన్నా కూడా పాజిటివ్ గానే వింటూ ఉంటారు. అలాంటిది పని కట్టుకుని చేశారో ఏమో తెలియదు కానీ అనవసరమైన వివాదంలో ఈ అమ్మడిని పడేశారు ట్రోలర్స్. గతంలో ఎప్పుడో ఆమె మాట్లాడిన మాటలను.. ఇప్పుడు వైరల్ చేస్తూ బాయ్ కాట్ వరకు తీసుకుని వచ్చారు. ఇలాంటివి ఎన్ని చేసినా సరే.. సాయి పల్లవికి ఉండే క్రేజ్ , ఇమేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గదని అమరన్ తో ప్రూవ్ అయింది. మేజర్ లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి ఈ సినిమాకు వెళ్లే వారు కొందరైతే.. కేవలం సాయి పల్లవిని చూసేందుకు మాత్రమే వెళ్లేవారు మరికొందరు. సౌత్ ఆడియన్స్ సినిమాల మీద చూపించే ప్రేమ గురించి తెలిసిందే. ఇప్పుడు సాయి పల్లవికి కూడా అలాంటి ప్రేమనే అందిస్తున్నారు ఆడియన్స్. ఈ క్రమంలోనే నార్త్ వద్దంటున్నా.. మేమున్నాం రమ్మంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు సాయి పల్లవి నుంచి రానున్న తండేల్ మూవీ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet