iDreamPost
android-app
ios-app

ఆ వీడియో షేర్ చేస్తూ సాయి పల్లవి పై ట్రోల్స్.. కారణం అదేనా ?

  • Published Oct 28, 2024 | 4:45 PM Updated Updated Oct 28, 2024 | 4:45 PM

Sai pallavi: ప్రస్తుతం సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. అయితే సాయి పల్లవి గురించి ఇప్పటివరకు ఎక్కడా చూసినా పాజిటివ్ గానే వింటూ వస్తున్నాం. కానీ గత రెండు రోజులుగా మాత్రం నెగిటివ్ గా వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Sai pallavi: ప్రస్తుతం సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. అయితే సాయి పల్లవి గురించి ఇప్పటివరకు ఎక్కడా చూసినా పాజిటివ్ గానే వింటూ వస్తున్నాం. కానీ గత రెండు రోజులుగా మాత్రం నెగిటివ్ గా వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 28, 2024 | 4:45 PMUpdated Oct 28, 2024 | 4:45 PM
ఆ వీడియో షేర్ చేస్తూ సాయి పల్లవి పై ట్రోల్స్.. కారణం అదేనా ?

వరుస తెలుగు , తమిళ సినిమాలతో బిజీగా మారిన హీరోయిన్ సాయి పల్లవి. ఎలాంటి గ్లామర్ , ఎక్స్పోజింగ్ లేకుండా కేవలం నటనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకు వెళ్తుంది సాయి పల్లవి. ఇప్పటివరకు సాయి పల్లవి గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ గానే వింటూ వస్తున్నారు. ఆమె ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ అనుకోకుండా రీసెంట్ గా ఈ హీరోయిన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా ఓ పాత వీడియో రిఫరెన్స్ తీసుకుని.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆమెను ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. ప్రస్తుతం సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ.. మరి కొద్దీ రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను బయటకు తీశారు ట్రోలర్స్.

అమరన్ మూవీ అనేది ఇండియన్ ఆర్మీకి విశేష సేవలు అందించిన.. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముకుంద్ వైఫ్ ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు. ఈ క్రమంలోనే.. ఆమె భారత సైనికులను టెర్రరిస్ట్ లని అర్ధం వచ్చేలా గతంలో మాట్లాడిందంటూ ఓ పాత వీడియోను షేర్ చేస్తున్నారు. గతంలో సాయి పల్లవి విరాట పర్వం సినిమా చేసేటప్పుడు. ఆ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వూస్ ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె ఒక నక్సల్ తో ప్రేమలో పడి.. తానె ఒక నక్సల్ గా మారడం చూపించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమెను హింస గురించి అడగడంతో.. తనకు హింస అంటే అర్థంకావడం లేదని.. మనం వారిని ఎలా ఉగ్రవాదులని భావిస్తామో.. వారు కూడా మన సైనికులను అలానే భావిస్తారని.. అది మనం చూసే కోణాన్ని బట్టి మారుతుందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆమె అదే ఆర్మీ సైనికుని వైఫ్ గా నటించడంతో.. ఈ వివాదాన్ని తెరపైకి తీసుకుని వస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా ఈ వీడియోస్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉన్నాయి. అలానే ఆమె పీఆర్ ల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ట్రోల్ చేస్తూనే వస్తున్నారు. గతంలో ఆమె ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ.. ట్రోలర్స్ మాత్రం ఇదే అదునుగా తీసుకుని పాత వీడియోలను తవ్వి తీస్తున్నారు. దీనితో నెటిజన్లు ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే సాయి పల్లవి దీని గురించి ఏమి స్పదించలేదు. ప్రస్తుతం ఆమె అమరన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రియల్ లైఫ్ స్టోరీ కావడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ఈ ట్రోల్స్ కు సాయి పల్లవి ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet