Vikram Vedha Trailer విక్రమ్ వేదా – మనం వదిలేసిన అవకాశం

సరిగ్గా అయిదేళ్ల క్రితం తమిళంలో విడుదలై తక్కువ అంచనాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమా విక్రమ్ వేదా. మాధవన్, విజయ్ సేతుపతిల కాంబోలో దర్శక ద్వయం పుష్కర్ గాయత్రిలు ఆవిష్కరించిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామా అక్కడ ఏకంగా బాహుబలి రికార్డులుతో పోటీ పడటం అతిశయోక్తి కాదు. ఇప్పుడది హిందీలో అదే టైటిల్ తో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ ల కలయికలో ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన డైరెక్టర్లే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టి దీన్ని పూర్తి చేశారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ చేశారు. కమర్షియల్ సినిమాకు దూరమైన నార్త్ ఆడియన్స్ ని ఇది థియేటర్లకు రప్పిస్తుందనే అంచనాలున్నాయి.

కానీ ఇలాంటి కల్ట్ క్లాసిక్ ని మన తెలుగు నిర్మాతలు వదిలేసుకున్నారు. ఇప్పటిదాకా రీమేక్ కు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. రవితేజ, వెంకటేష్, రానా ఇలా ఏవేవో కాంబోలతో పేర్లు వినిపించాయి కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ముందే వచ్చి ఉంటే ఎక్కువ ఎడ్జ్ వచ్చేది కానీ ఇప్పుడు హిందీ విక్రమ్ వేదా వల్ల ఆ ఛాన్స్ పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే మన ఆడియన్స్ కూడా దీన్ని అధిక శాతం చూసేస్తారు. బాష సమస్య వల్ల అరవంది మిస్ అయినవాళ్లే ఎక్కువ. ఒకవేళ ఈ హృతిక్ సైఫ్ ల వెర్షన్ కి తెలుగు డబ్బింగ్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇవాళ ట్రైలర్ రిలీజయ్యాక పోలికల మీద ఆల్రెడీ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్స్ మొదలైపోయాయి.

ఎక్కడైనా సినిమాకు హిట్ టాక్ వస్తే దాన్ని చకచకా రీమేక్ చేస్తున్న టాలీవుడ్ లో ఈ ఒక్క విక్రమ్ వేదాకు మాత్రమే సమస్య వచ్చింది. ఇక ఈ రోజు విషయానికి వస్తే విజయ్ సేతుపతికి ఏ మాత్రం తీసిపోకుండా హృతిక్ రోషన్ తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేసేలా ఉన్నాడు. సైఫ్ కి ఇలాంటి క్యారెక్టర్లు కొత్త కాకపోయినా ఇంత పాజిటివ్ అవుట్ లుక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించి చాలా కాలమయ్యింది. సెప్టెంబర్ 30న మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తో తలపడేందుకు విక్రమ్ వేదా రెడీ అవుతోంది. పోటీ గురించి నిర్మాతలు ఆలోచించడం లేదు. 2022లో బిగ్గెస్ట్ హిట్ గా విక్రమ్ వేదానే నిలుస్తుందనినే ధీమాలో ఉన్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించింది

Show comments