iDreamPost
android-app
ios-app

వీడియో: భైరా వచ్చేశాడు.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడేంటి?

Devara- Saif Ali Khan As Bhaira Teaser Review: దేవర పార్ట్ 1 నుంచి క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న భైరా పాత్రకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత దేవర మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

Devara- Saif Ali Khan As Bhaira Teaser Review: దేవర పార్ట్ 1 నుంచి క్రేజీ అప్ డేట్ రానే వచ్చింది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న భైరా పాత్రకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత దేవర మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

వీడియో: భైరా వచ్చేశాడు.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నాడేంటి?

దేవర పార్ట్ 1 గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే తారక్ కూడా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అతి త్వరలోనే గుమ్మడికాయ కొట్టేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఒకవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే.. మరోవైపు మూవీ నుంచి అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా భైరాని ప్రేక్షకులకు పరిచయం చేశారు. భైరాని చూస్తే కాస్త కంగారు పుడుతుంది. ఎందుకంటే చూడటానికి చాలానే వైలెంట్ గా ఉన్నాడు. రక్తం రుచి మరిగిన పులిలా అతను వేటాడుతున్నాడు. మరి.. భైరా టీజర్ ఎలా ఉందో చూద్దాం.

దేవరను ఢీకొట్టేందుకు భైరాగా సైఫ్ అలీ ఖాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భైరా వేషధారణ మాత్రమే చూశారు. కానీ, ఇప్పుడు అతను ఎంత వైలెంట్ గా ఉంటాడు అనే విషయాన్ని చూపించారు. కాదు కాదు 50 సెకన్ల విధ్వంసాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బరిలోకి ఒక్కొక్కరిని భైరా విసిరేస్తుంటే.. కచ్చితంగా ఎవరికైనా కంగారు పుడుతుంది. కుస్తీ బరిలో మట్టి నిండా అతని చేతిలో చావు దెబ్బలు తిన్న వాళ్ల రక్తం పడి ఉంది. ఆ రక్తపు మడుగులో అతను ప్రశాంతంగా పడుకోవడం చూస్తే.. నిజంగా మనిషి అని మాత్రం అనలేము. అంత కృూరంగా భైరాని చూపించారు. అతను కొడుతున్న ఒక్కో దెబ్బకు ఒక్కొక్కళ్లు ఎగిరి అవతల పడుతున్నారు. అతను కొట్టే ప్రతి దెబ్బను ఎంజాయ్ చేయడం ఆ ముఖంలో చూడచ్చు.

దేవర కెపాసిటీకి ఈ మాత్రం విలనిజం ఉండాల్సిందే. ఎందుకంటే హీరోకి విలన్ గట్టి పోటీ ఇస్తేనే.. రెండు పాత్రల మధ్య సంఘర్షణ బాగుటుంది. ఇక్కడ ఆ స్కోప్ చాలా బాగుంది. అయితే భైరాని యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే చూపించారు. గతంలో వచ్చిన పోస్టర్ లో చూస్తే కాస్త పెద్ద వయసులా అనిపిస్తాడు. కానీ, ఇక్కడ మాత్రం కుర్రాడిలా చూపించారు. అలాగే ఇంతో యంగ్ గా ఉన్న ఎన్టీఆర్ పిక్ కూడా చూశాం. కాబట్టి వీళ్ల మధ్య గొడవ అనేది ఇప్పటిది కాదు. మొదటి నుంచి వీళ్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అలా వాళ్లిద్దరు ఎదిగి రెండు గ్యాంగులుగా ఏర్పడేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఇద్దరీనీ ఫ్రెండ్స్ లా చూపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక గ్యాంగ్ లో సభ్యులుగా చేరి.. మిత్రులుగా మారి.. ఆ తర్వాత వారి ఆలోచనల వల్ల విడిపోయి శత్రువులు కూడా అయ్యేందుకు ఆస్కారం ఉంది. మరి.. భైరా vs దేవర యుద్ధానికి రెడీగా ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.