iDreamPost
android-app
ios-app

Devara: దేవర నుంచి మరో సాలిడ్ అప్డేట్! ఫ్యాన్స్ కు పూనకాలే..

  • Published Aug 16, 2024 | 12:07 PM Updated Updated Aug 16, 2024 | 12:08 PM

Saif Ali Khan Bhaira Glimpses: దేవర మూవీ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ను వదిలారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే?

Saif Ali Khan Bhaira Glimpses: దేవర మూవీ నుంచి మరో సాలిడ్ అప్డేట్ ను వదిలారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే?

  • Published Aug 16, 2024 | 12:07 PMUpdated Aug 16, 2024 | 12:08 PM
Devara: దేవర నుంచి మరో సాలిడ్ అప్డేట్! ఫ్యాన్స్ కు పూనకాలే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ ‘దేవర’. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేయడానికి సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రోబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి వరుస అప్డేట్స్ తో అభిమానులకు ఫుల్ కిక్కిస్తున్నారు మేకర్స్. ఇటీవలే తారక్ స్వయంగా ఓ అప్డేట్ ఇవ్వగా.. తాజాగా మేకర్స్ మరో క్రేజీ న్యూస్ ను పంచుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను వదిలారు.

దేవర మూవీ నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ను ఇచ్చారు. ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయను బర్త్ డే విషెస్ ను చెబుతూ.. మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. ఈ మూవీలో సైఫ్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఆయన పాత్ర పేరు ‘భైర’ అని రివీల్ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 4: 05 నిమిషాలకు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ గ్లింప్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించిన సీన్లే ఉంటాయా? లేక తారక్ కు సీన్లు కూడా ఉంటాయన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్ సీన్లు కూడా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటితో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమని కూడా వారు తెలుపుతున్నారు.

Devara

ఇదిలా ఉండగా.. ఇటీవలే దేవర పార్ట్ 1 కు సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తారక్ స్వయంగా వెల్లడించాడు. శరవేగంగా షూట్ పూర్తి చేసుకుంటున్న దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాగా.. ఆయుధ పూజ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్. దాంతో సినిమాపై ఇంకాస్త హైప్ పెరిగిపోయింది. ఇక ఇప్పటికే విడుదలై రెండు పాటలు చాట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigboss