iDreamPost
android-app
ios-app

ప్రపంచంలో ఎవరు అడ్డు వచ్చినా ఆగదు

ప్రపంచంలో ఎవరు అడ్డు వచ్చినా ఆగదు

ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని వైఎస్సార్సిపి పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా సీఎం జగన్‌ ప్రకటించారని, అది తప్పకుండా అమలు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొందరు అడ్డంకులు సృష్టించినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఉంటుందని తెలిపారు.

మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో కాదో తనకు తెలియదన్నారు. భూములు పోతాయనే భయంతో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, సుజనా కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా అవతరించి తీరుతుందని విజయసాయిరెడ్డి పునరుద్ఘటించారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారాలని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. విశాఖ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, 1926లో తొలి విశ్యవిద్యాలయం (ఆంధ్రా యూనివర్శిటీ) ఇక్కడే ఏర్పడిందని గుర్తు చేశారు. దేశంలోనే 9వ పెద్ద నగరంగా ఉన్న విశాఖను ప్రకృతి, పర్యావరణానికి కేంద్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు.