ఐసీయూలో బ్రిటన్ ప్రధాని

  • Published - 03:44 AM, Tue - 7 April 20
ఐసీయూలో బ్రిటన్ ప్రధాని

గత గురువారం కరోనా బారిన పడినట్లు బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. వారం రోజుల పాటు హోమ్ క్వారెంటయిన్ లో ఉంటే సరిపోతుందని బ్రిటన్ ప్రధానికి వైద్యులు సూచించిన సంగతి తెలిసిందే. కాగా వైరస్ లక్షణాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరిన్ని రోజులు క్వారెంటయిన్ లో ఉండబోతున్నట్లు బోరిస్ జాన్సన్ వీడియో సందేశం ద్వారా ప్రజలకు వివరించారు.

కానీ వైరస్ లక్షణాలు తీవ్రతరం కావడంతో బ్రిటన్ ప్రధానిని వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. “నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్బంధం కూడా పూర్తయింది. అయినా, నాలో ఇంకా స్వల్పంగా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్బంధంలో ఉంటాను” అని వీడియో సందేశం ద్వారా బోరిస్ జాన్సన్ వెల్లధించారు.

కాగా సోమవారం నాటికి వైరస్ లక్షణాలు,వ్యాధి తీవ్రత ప్రధాని శరీరంలో పెరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు..ప్రధాని మోడీ,బోరిస్‌ జాన్సన్‌ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేయగా, అమెరికన్లు బోరిస్ జాన్సన్ ఆరోగ్యం గురించి ప్రార్ధిస్తున్నారని, ట్రంప్ వ్యాఖ్యానించారు. బ్రిటన్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని తెలిపారు..

Show comments