iDreamPost
android-app
ios-app

ఇండియా అంటే ద్వేషం! అణుబాంబు వేస్తానంటున్న యూట్యూబర్‌!

UK Youtuber Comments On India: యూకేకి చెందిన ఓ యూట్యూబర్ భారత్ పై ఉన్న తన ద్వేషాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించాడు. అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

UK Youtuber Comments On India: యూకేకి చెందిన ఓ యూట్యూబర్ భారత్ పై ఉన్న తన ద్వేషాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించాడు. అతడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇండియా అంటే ద్వేషం! అణుబాంబు వేస్తానంటున్న యూట్యూబర్‌!

ప్రపంచంలో జాత్యహంకారం  కొన్ని దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా యూకే,అమెరికా వంటి దేశాల్లో ఈ జాత్యహంకారం కనిపిస్తుంది. అందుకే అక్కడ ఉండే నల్లజాతీయులపై దాడులు కూడా చేస్తుంటారు. అలానే ఎంతో మంది భారతీయులు జాత్యహకారం కారణం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో కొందరు మన దేశంపై తమ అసూయను వ్యక్తం చేస్తూ జాత్యహకారాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా బ్రిటన్ కి చెందిన ఓ యూట్యూబర్ భారత్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై అణుబాంబుపడే అవకాశం ఉందంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మైల్స్ రూట్ లెడ్జ్ అనే యూకే కి చెందిన యూట్యూబర్ ఎప్పుడు వివాదాలతో వార్తలో ఉంటాడు. ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ..సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఇప్పటికే అనేక రకాల పోస్టు, వీడియోలు పెట్టిన అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి భారతీయులను ఉద్దేశించి జాత్యహంకార వ్యాఖ్యలు చేయడంతో వెలుగులోకి వచ్చాడు. భారతతీయులపై ఉన్న తన జాత్యహారాన్నిమరోసారి బయటపెట్టుకున్నాడు. 2021లో తాలిబాన్ స్వాధీనం సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన వారి గురించి మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

తాజాగా భారత్ పై అణుబాంబు వేస్తా అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టి వెలుగులోకి వచ్చాడు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ పై అణు క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు వీడియోను చిత్రీకరించాడు.  ఆ వీడియోను రౌట్‌లెడ్జ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. అతను వీడియోతో పాటు రెచ్చగొట్టే క్యాప్షన్‌తో ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అంతేకాక ఒకవేళ తాను బ్రిటన్ ప్రధాని  అయితే విదేశీ శక్తుల నుంచి చిన్నపాటి రెచ్చగొట్టే చర్యలను సంహించని తెలిపారు. అలాంటి దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోనని సూచించారు. అలా అతడు వీడియో పెట్టడం ద్వారా తాను భారత్ వ్యతిరేకిన తెలుపుకున్నాడు. రౌడీయిజం అక్కడితో ఆగలేదు. అంతేకాక ఇతర నెటిజన్లను అవమానకరమైన భాష, మూస పద్ధతులతో ఎగతాళి చేశాడు. జాతిపరమైన దూషణలు, అభ్యంతరకరమైన భాషతో కూడిన అతని వ్యాఖ్యలు ఇండియన్స్ లక్ష్యంగా చేసుకున్నాయి.

అతనిపై పలువురు నెటినజ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..వారికి ధీటుగా  విమర్శలు పెరగడంతో, రౌట్‌లెడ్జ్ తన వైఖరిని రెట్టింపు ప్రతిస్పందించాడ. భారతదేశం పట్ల తనకున్న అయిష్టత నిజమైనదని పేర్కొన్నాడు. అయితే అతడి వ్యాఖ్యలను ప్రపంచ వ్యాప్తంగా ఉండే సోషల్ మీడియా ఫాలోవర్స్ విస్తృతంగా ఖండించబడ్డారు. ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని ట్విట్టర్ ను పలువురు నెటిజన్లు  కోరారు. ఎన్ని ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, యూట్యూబర్ ఇంకా క్షమాపణలు చెప్పలేదు. అలానే తాను చేసిన  ప్రకటనలను ఉపసంహరించుకోలేదు.