iDreamPost
android-app
ios-app

బ్రిటన్ లో కనుమరుగవుతున్న సీతాకోక చిలుకలు.. కారణం ఇదే

  • Published Sep 20, 2024 | 2:04 PM Updated Updated Sep 20, 2024 | 2:04 PM

ప్రకృతి ప్రేమికులకు సీతాకోక చిలుకలంటే చాలా ఇష్టం. పైగా ఇవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరి అలాంటి సీతాకోకచిలుకలు బ్రిటన్ దేశాస్తులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రకృతి ప్రేమికులకు సీతాకోక చిలుకలంటే చాలా ఇష్టం. పైగా ఇవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరి అలాంటి సీతాకోకచిలుకలు బ్రిటన్ దేశాస్తులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 20, 2024 | 2:04 PMUpdated Sep 20, 2024 | 2:04 PM
బ్రిటన్ లో కనుమరుగవుతున్న సీతాకోక చిలుకలు.. కారణం ఇదే

ప్రకృతి అంటేనే అనేక ప్రాణికోటి సమాహారం. మరి అలాంటి ప్రకృతిలో చెట్టూ, చేమ, పక్షీ,జంతువులు వంటివి చాలానే జీవిస్తున్నాయి.కానీ, రాను రాను ఈ జీవులన్నీ, ప్రకృతి విధ్వంసంతో క్రమంగా అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. అలాంటి వాటిలో సీతాకోక చిలకలు కూడా ఒకటి. ఇవంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సీతాకోక చిలుకలను చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. రంగు రంగుల రెక్కలతో ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా కనిపించే ఈ సీతాకోక చిలుకలు ఎక్కువగా పల్లెల్లో, గ్రామాల్లో చెట్లపై కనిపిస్తుంటాయి. పైగా వివిధ వర్ణాలతో కూడిన వీటి అందన్నీ చూడ్డానికి రెండు కళ్లూ కూడా చాలవు. ఇళా ఎల్లవేళలా కనిపించే ఈ సీతాకోక చిలుకలు రాను రాను కనుమరుగైపోతున్న విషయం తెలిసిందే. అయితే బ్రిటన్ దేశాస్తులకు ఈ సీతాకోకచిలుకలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రకృతి ప్రేమికులకు సీతాకోక చిలుకలంటే చాలా ఇష్టం. పైగా ఇవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరి అలాంటి సీతాకోక చిలుకలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ దేశంలో అయితే ఈ సీతాకోక చిలుకలు సంఖ్య రికార్డు స్థాయిలో సగానికి పడిపోయిందని తాజా ఆధ్యయనంలో తెలిసింది. అంతేకాకుండా.. అటవీ ప్రాంతాల్లో సైతం వీటి జాడ కనిపించడం లేదని ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిజానికి బ్రిటాన్ ఒకప్పుడు అరుదైన జాతుల సీతాకోక చిలుకులకు నిలయంగా ఉండేది. కానీ, ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు బటర్ ఫ్లై సంరక్షణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా సౌత్ డౌన్స్ నేషనల్ పార్క్ లో ఎప్పుడు కనిపించే సీతాకోకచిలుకలు ప్రస్తుతం కనుమరుగైనట్లు పేర్కొన్నారు.

ఇక ఈ సీతాకోక చిలుకలు ఉనికిపై దేశంలో లక్ష నాలభై వేల సర్వేలు చేయగా.. ఇందులో తొమ్మిదివేల సర్వేలో.. 0 సీతాకోక చిలుకల గణాంకలు నమోదైనట్లు సీనియర్ సర్వే అధికారి జోరాండ్ చెప్పారు. అంతేకాకుండా.. సర్వేలు చేసినప్పుడు అటవీ ప్రాంతంలో కూడా కనీసం ఒక్క సీతాకోక చిలుక కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆయన ఆయన పేర్కొన్నారు. ఇక గతేడాదితో పొలిస్తే సర్వేలో.. ఈ ఏడాది సీతాకోకచిలుకల సంఖ్య సగటు 12 నుంచి 7కు పడిపోయింది. ఇలా చూసుకుంటే.. దాదాపు 50 శాతం సీతాకోక చిలుకలు కనుమరుగైయ్యాయి. బ్రిటన్ లో సీతాకోక చిలుకలు సంఖ్య కనుమరుగవుతుందనడానికి ప్రధాన కారణం.. పంట పొలాలు, ఉద్యాన వనాల్లో క్రిమిసంహాకారకాలను వినియోగించటమే సీతాకోకచిలుకలు సంఖ్య పడిపోతున్నాయి.

వీటి వాడకాల వలన సీతాకోక చిలుకలు తగిన ఆవాసలు కరువైయ్యాయి. అందుకే కొన్ని ప్రమాదకరమైన క్రిమిసంహాకారలపై పూర్తిగా నిషేధించాలని బటర్ ఫ్లై సంరక్ష సంస్థలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే ప్రకృతి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశాయి. బ్రిటన్ లో బటర్ ఫ్లై లా పరిస్థితి చాలా భయంకరంగా ఉండటంతో.. సీతాకోకచిలుకల అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు బటర్ ఫ్లై కన్జర్వేషన్ పేర్కొంది. అలాగే యూకేలో కూడా అనేక ప్రసిద్ధి చెందిన సీతాకోకచిలుకలు అంతరించే ప్రమాదం ఉందని బటర్ ఫ్లై సంరక్షణ అధికారులు తెలిపారు.

నిజానికి ఈ సీతాకోక చిలుకలను మనం  కాపోడుకంటే.. ఇవి పర్యావరణాన్ని కాపాడుకుంటాయి. ఎందుకంటే.. ఇవి కీటకాలను తింటాయి, పువ్వులను పరాగసంపర్కం చేస్తాయి. అంతేకాకుండా.. దోమల వంటి తెగుళ్లను నియంత్రించడంలో సహాయపడతాయి. మరి ఇన్ని రకాలుగా పర్యావరణాన్ని కాపాడిన ఈ సీతాకోక చిలుకలు క్రమంగా అంతరించిపోవడానికి క్రిమిసంహారకా రసాయానాలే కారణం అవుతున్నాయి. కనుక వీలైనంతా వరకు ఈ క్రిమిసంహార రసాయానాల వినియోగాన్ని తగ్గించి సీతాకోకచిలుకలు కాపోడుకోవడం మంచింది. మరి, బ్రిటన్ లో సీతాకోక చిలుకుల అంతరించిపోవడం వెనుక కారణం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.