iDreamPost
android-app
ios-app

అమెరికాలో మళ్లీ మొదలైన సందడి

అమెరికాలో మళ్లీ మొదలైన సందడి

గత రెండునెలల నుండి అగ్ర రాజ్యం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న ఈ తరుణంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చెరువైంది. న్యూయార్క్ న్యూజెర్సీ లాంటి నగరాల్లో కరోనా ఉధృతి ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ఈ నెపధ్యంలో కొంత కాలంగా దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కరోనా తీవ్రత కొంచెం తక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రజలు స్వేచ్చ వైపే మొగ్గు చూపారు. దీంతో స్థానిక ప్రజల నుండి వస్తున్న విజ్నప్థుల మేరకు దేశ వ్యాప్తంగా 31 రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్ నిభంధనలను సడలించాయి.

దీంతో అమెరికాలో అయా రాష్ట్రాల్లో మళ్లీ సందడి మొదలైంది. దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాకడౌన్‌ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించారు. ఫ్లోరిడా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌లలో రోడ్లన్నీ బిజీబిజీగా కనిపిస్తున్నాయి. దీంతో అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బీచ్‌ లలో సందడి మొదలైంది. కిక్కిరిసిన జన సమూహాలు ఈ బీచ్‌లు, రెస్టారెంట్లు, పార్క్‌ల్లో కనిపిస్తున్నాయి.

ఇప్పటికే 8 లక్షల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడి, 68 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ, అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల మూడ్‌ను గమనించిన ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాకడౌన్‌ నిబంధనలను సడలించారు. గృహ నిర్బంధాలను వీడి జనం తమ కార్యకలాపాలను సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిన్న చిన్న వ్యాపారాలు మొదలయ్యాయి. కార్యాలయాలకు మళ్లీ జనకళ వచ్చేసింది.

దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా బీచ్‌లలో సందడి కనిపిస్తోంది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, నగరం మియామీ మళ్లీ కేసినోలతో సందడి చేస్తోంది. ఫ్లోరిడాలో అన్ని రెస్టారెంట్లలో 25 శాతం కెపాసిటీతో ప్రారంభించడానికి అనుమతించగా, పెద్దఎత్తున జనం ఎగబడుతున్నారు. క్యాలిఫోర్నియాలో అధికారికంగా ఇంకా సడలింపులు రాకపోయినప్పటికీ, జనం ఏమాత్రం పట్టించుకోకుండా యదేచ్ఛగా తిరుగుతున్నారు. మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. సియాటిల్‌లో మార్కెట్లు రెండు నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. టెక్సాస్‌లో వేలాది మంది బీచ్‌లలో సందడి చేస్తుండగా, వర్జీనియాలో గోల్ఫ్‌ మైదానాలు నిండిపోయాయి. న్యూయార్క్‌లోని రెండు అతి పెద్ద పార్క్‌లు సెంట్రల్‌, ప్రాస్పెక్టలు రద్దీగా కనిపిస్తున్నాయి.

లాక్ డౌన్ నిభందనలను సడలించిన తరుణంలో రానున్న రోజుల్లో కరోనా వైరస్ తీవ్రత అమెరికన్ల పై ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న అందోళన పలువురిలో నెలకొనివుంది. ఈ నెపధ్యంలో ఈ రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులపై మరి కొన్ని రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది